గ్రామ స్వరాజ్యం లక్ష్యం కావాలి


Sat,February 23, 2019 12:06 AM

శామీర్‌పేట: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ అన్నారు. శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గత ఐదు రోజులుగా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూతన సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ చట్టాలపై అవగాహన, సర్పంచ్‌ల విధులు, బాధ్యతలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతీ మండలంలో రెండు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. హరితహారం, పారిశుధ్యం, మౌలిక సదుపాయల కల్పన వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలన్నారు. శిక్షణ కార్యక్రమం చివరి రోజు సర్పంచ్‌లు వారివారి అభిప్రాయాలను పంచుకున్నారు.

ముఖ్యంగా పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్నట్లుగా సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉండవద్దని ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్‌ను తొలగించాలని కోరారు.ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. అనంతరం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న 61 మంది సర్పంచ్‌లకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నల్సార్ రిజిస్టార్ బాలక్రిష్టారెడ్డి, ఏడీఏ శోభారాణి, టీఓటీలు బాలాపూర్ మాజీ సర్పంచ్ పారిజాత, ఎ.వెంకటేశ్, ఎంపీడీఓ పద్మావతి, ఈఓపీఆర్డీలు మల్లికార్జున్, రమేశ్, యుగేంధర్‌రెడ్డి, ఈఓపీఎస్ మధుసూదన్‌రెడ్డి, మాజీ హెచ్‌ఎం పాపిరెడ్డి, వ్యవసాయ అధికారి రమేశ్, నల్సార్ అధ్యాపకులు వాగేశన్, శివచరణ్, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...