బలితీసుకుంటున్న క్వారీ గుంతలు


Sat,February 23, 2019 12:03 AM

-స్నానాలు, కాలకృత్యాలకు వెళ్లి మృత్యువాత
-ఇప్పటి వరకు 12 మంది మృతి
-ఆందోళనలో బాలయ్యనగర్ బస్తీవాసులు
-మూడో రోజు దొరికిన సాయిలు మృతదేహం
జీడిమెట్ల : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్, బాలయ్యనగర్ బస్తీ సమీపంలోని క్వారీ గుంతలు ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి మైనింగ్ వ్యాపారం పేరిట చేపట్టిన తవ్వకాలతో క్వారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో వర్షం నీరు చేరడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. కా గా... బాలయ్యనగర్ బస్తీ ప్రజలు స్నానాలు, కాలకృత్యాల కోసం క్వారీ గుంతలకు వెళ్లి మృత్యువాతపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 12మంది ఈ క్వారీ గుంతల్లో పడి మృతి చెందారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఈత కోసం వచ్చిన పలువురు ఇందులో మునిగి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. తరచుగా ఇందులో పడి మృతి చెందుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు గత సంవత్సరం క్వారీ గుంతల పరిసరాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
తాజాగా ఈనెల 19న సాయంత్రం బాలయ్యనగర్ బస్తీకి చెందిన ఓర్సు సాయిలు స్నానం చేయడానికి వెళ్లి అందులో గల్లంతయ్యాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు చర్యల ఫలితంగా మూడో రోజు శుక్రవారం ఉదయం 8గంటలకు సాయిలు మృతదేహా న్ని కనుగొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ సాయిలు మృతదేహాన్ని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాం ధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...