విభజనపై ఆసక్తి


Fri,February 22, 2019 01:29 AM

25ఎంపీటీసీ, 21 జడ్పీటీసీ స్థానాలు
జిల్లా వ్యాప్తంగా 116 ఎంపీటీసీ,
2 జడ్పీటీసీ స్థానాలు తొలగింపు
రంగాడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్, మండల ప్రాదేశిక నియోజకవర్గాల విభజనను అధికారులు ముమ్మరం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలు జిల్లాలో ఎన్ని ఉండబోతున్నాయని జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రాదేశిక నియోజకవర్గాలపై స్పష్టత ఏర్పడిన తర్వాత రిజర్వేషన్లు ప్రకటించేందుకు సులువవుతుంది. ప్రస్తుతానికైతే జిల్లాలు, మండలాల జాబితాపై అధికారులు కసరత్తు చేశారు. కేవలం గ్రామీణ మండలాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. జిల్లాలో 23 మండల్లాలో గతంలో 374 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఇప్పుడు 25కి కుదించారు. జడ్పీటీసీ స్థానాలు గతంలో 17 ఉండగా నూతనంగా ఏర్పాటైన మూడు మండలాలతో 21కి చేరాయి. అయితే ఇందులో రాజేంవూదగర్, సరూర్‌నగర్ మండలాలను పూర్తిగా మినహాయించారు.

23మండలాల్లో 21 గ్రామీణం..అర్బన్..
ప్రస్తుతం రంగాడ్డి జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. అయితే వీటిలో 2 అర్బన్ మండలాలను తొలగించారు. 21 గ్రామీణ మండలాలతో జడ్పీటీసీ, మండల ప్రాదేశిక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. 23 మండల్లాలో 25 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. గతంలో కంటే జిల్లాలో మూడు మండలాలు పెరగడంతో జిల్లాలో జడ్పీటీసీ స్థానాలు పెరుగనున్నాయి.

తగ్గించిన, పెంచిన స్థానాలు
హాయత్ నగర్‌లో 23 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 12కు కుదించారు. ఇబ్రహీంపట్నంలో 4, మహేశ్వరంలో 6, శంషాబాద్‌లో 12, శంకర్‌పల్లిలో 6, కొందుర్గులో 9, కొత్తూరులో 9, తలకొండపల్లిలో 3, అమనగల్లులో 13 చొప్పున ఎంపీటీసీలను కుదించారు. అలాగే ఫరూఖ్‌నగర్‌లో 1 ఎంపీటీసీ స్థానం పెంచారు. నూతనంగా ఏర్పాటైన కడ్తాల్‌లో 10 ఎంపీటీసీ స్థానాలు, చౌదరిగూడ, నందిగామ మండలాల్లో 9 స్థానాలు పెంచారు. కొన్ని ప్రాంతాల్లో మున్సిపాల్టీలో విలీనం కాగా మరికొన్ని నూతనంగా మున్సిపాల్టీలుగా ఏర్పాటు కావడంతో 374 ఎంపీటీసీ స్థానాలను 25కి కుదించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 116 ఎంపీటీసీ స్థానాలను తొలగించారు. గురువారం విడుదల చేసిన ముసాయిదాపై ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాలేవని అధికారులు చెబుతున్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...