మిస్డ్‌కాల్ ఆధారంగా పర్సు అందజేత...


Wed,February 20, 2019 12:47 AM

-ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌కు ప్రశంసలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇంట్లో దావత్ ఉండడంతో బంధువులు వస్తున్నారు...వారికి మర్యాదలు చేసే క్రమంలో ఓ గృహిణి హడావిడిగా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ పర్సు పడేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ సుజనా ఫోరమ్ మాల్ వద్ద చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానందచారి నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి ఫొటోలను తీసేందుకు సర్కిల్ వద్ద నిలబడ్డాడు. ఆ సమయంలో రోడ్డుపై పర్సు కనపడింది. అందులో నగదుతో పాటు మొబైల్ ఫోన్ కనపడింది. మొబైల్ ఫోన్ మిస్డ్ కాల్స్‌ను గుర్తించి ఆ నెంబర్‌కు ఫోన్ చేసి.. మీకు సంబంధించిన పర్సు రోడ్డుపై దొరికింది.. మీరు వచ్చి తీసుకువచ్చని చెప్పడంతో...పర్సు కనిపించకపోవడంతో అప్పటికే బాధలో ఉన్న ఆ గృహిణి సంతోషంలో మునిగిపోయింది. నగదును అప్పజెప్పే సమయంలో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పర్సు ఆ గృహిణిదేనని నిర్ధారించుకుని అప్పగించారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన మంగళవారం స్థానికంగా సోషల్ మీడియా గ్రూపులో వైరల్‌గా మారి ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్‌పై ప్రశంసలు కురపించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...