శతమానం భవతి


Mon,February 18, 2019 12:58 AM

-సీఎం కేసీఆర్ పుట్టిన రోజున పలు సేవా కార్యక్రమాలు
-అన్నదాన, రక్తదాన శిబిరాల నిర్వహణ
-నిండునూరేండ్లు చల్లగా ఉండాలని
సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: ప్రియతమ నేతకు దీవెనలు పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ ప్రధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నగరవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పలు సేవా
కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనేక చోట్ల మొక్కలు నాటారు.
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు చల్లంగా ఉండాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నం .12లోని మంత్రుల నివాసంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత, కుమార్తె నందిని, టీఆర్‌ఎస్ నాయకులు పోలుమల్ల శ్యాంకుమార్, ఎంపీపీ శ్రీనివాస్, రావూరి రవీందర్, వేముల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -బంజారాహిల్స్

తెలంగాణ సినిమా అభిమానుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిమ్స్‌లో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షులు పూర్ణచందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిమ్స్‌కు పునర్జన్మనిచ్చారని, దవాఖాన అభివృద్ధికి నిధులు కేటాయించి, పేదలకు ఆధునిక వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
-ఖైరతాబాద్

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...