50 వేల మందికి రూ.1 నల్లా కనెక్షన్లు


Mon,February 18, 2019 12:56 AM

-రూపాయి నల్లా కనెక్షన్లకు అపూర్వ ఆదరణ
-సద్వినియోగం చేసుకుంటున్న నిరుపేదలు
-జలమండలికి 55 వేల దరఖాస్తులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దారిద్య్రరేఖకు దిగువనున్న ఇండ్లకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ విధానానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. పేదలకు నల్లాల ద్వారా సమృద్ధిగా నీరందించే ప్రక్రియలో భాగంగా జలమండలి గతేడాది డిసెంబర్ నుంచి కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నిరుపేదలు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే గడిచిన కొన్ని నెలలుగా సంస్థ పరిధిలో 55వేల దరఖాస్తులను స్వీకరించిన జలమండలి అధికారులు ఇందులో 50 వేల మందికి నల్లా కనెక్షన్లు మంజూరు చేశారు. 5వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రూ.1 మంజూరైన నల్లా కనెక్షన్లలో కనెక్షన్‌కు అయ్యే వస్తువుల చార్జీలు, రోడ్డు కటింగ్ మరమ్మతు చార్జీలను జలమండలిచే భరిస్తుందని, ఈ విషయంలో ఎలాంటి అదనపు చెల్లింపులు అక్కర్లేదని ఎండీ దానకిశోర్ చెప్పారు. ఈ నల్లా కనెక్షన్ల జారీలో దళారులను ఆశ్రయించవద్దని, స్థానిక మేనేజర్, డీజీఎంలను సంప్రదించి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. డిప్యూటీ తహశీల్దార్, అపై రెవెన్యూ విభాగం అధికారుల ద్వారా జారీ చేసిన ఆదాయపు ధ్రువీకరణ పత్రంతో పట్టా సర్టిఫికెట్, సేల్ డీడ్ దస్తావేజులు అందుబాటులో లేనప్పుడు రూ. 20 స్టాంప్ పేపర్‌పై స్థల వైశాల్యంపై ధ్రువీకరణకై దరఖాస్తుదారుడు ఒక ఆఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...