రెండు వేలు లంచం తీసుకుంటూ..


Sun,February 17, 2019 01:02 AM

-ఎసీబీకి చిక్కిన ఎస్‌ఐ
శేరిలింగంపల్లి: రెండు వేలు లంచం తీసుకుంటూ అవినీతి శాఖ అధికారులకు రాయదుర్గం ఎస్‌ఐ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన కథనం ప్రకారం... ద్విచక్ర వాహన క్యాబ్ డ్రైవర్ విధులు నిర్వర్తిస్తున్న మురళీ వరప్రసాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో జనవరిలో ఓ కస్టమర్‌ను ద్విచక్రవాహనంపై వెనకాల కూర్చొబెట్టుకొని గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఖాజగూడ జంక్షన్ సమీపంలో వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ మురళీ వరప్రసాద్‌తో వెనుకాల కూర్చున్న కస్టమర్ సైతం స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సదరు కస్టమర్ ఈ విషయమై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మురళీ వరప్రసాద్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే తనకు గాయాలయ్యాయని ఫిర్యాదు చేశారు. రాయదుర్గం ఎస్‌ఐ జీ. శశిధర్ కేసు నమోదు చేసి మురళీ వరప్రసాద్‌ను రిమాండ్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తనకు రూ. 5 వేలు లంచం ఇస్తే స్టేషన్ బెయిల్ ఇస్తానని పేర్కొన్నాడు. చివరకు 4 వేలకు లంచం తీసుకునేందుకు అంగీకరించి అడ్వాన్స్‌గా రూ: 2వేల ఇటీవల తీసుకున్నాడు. మిగిలిన 2వేలు శనివారం ఇచ్చేందుకు అంగీకరించిన మురళీ వరప్రసాద్.. ఏసీబీ అశ్రయించాడు. శనివారం రూ. 2 వేలు లంచం తీసుకుంటున్న రాయదుర్గం ఎస్‌ఐ శశిధర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...