అర్హతలు తెలంగాణలో ఎప్పుడో నిర్ణయించాం


Sat,February 16, 2019 12:32 AM

-జేటీసీ పాండురంగనాయక్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్(ఏఎంవీఐ), మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్(ఎంవీఐ), రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ల(ఆర్‌టీవో)ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హతలను ఎప్పుడో నిర్ణయించామని హైదరాబాద్ జేటీసీ పాండురంగ నాయక్ తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏఎంవీఐ, ఎంవీఐ, ఆర్‌టీవోల రిక్రూట్‌మెంట్ అర్హతల విధివిధానాలపై జరిగిన వివిధ రాష్ర్టాల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ రాష్ట్రంలో ఆర్‌టీఏ ఎం వ్యాలెట్, ఆన్‌లైన్ సేవలు, రిక్రూట్‌మెంట్ అర్హత వంటి అనేక నిర్ణయాలు జరిగి అమలవుతున్నాయని చెప్పారు. చాలా సంవత్సరాలుగా ఏఎంవీఐల రిక్రూట్‌మెంట్‌లో ఆటోమొబైల్ బీటెక్/డిప్లామా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పట్టాతో పాటు బీటెక్ మెకానికల్ పట్టా ఉన్నవారిని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా ఏఎంవీఐగా ఎంపిక కావాలంటే విద్యార్హత సర్టిఫికెట్‌తోపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మహిళా ఏఎంవీఐలకైతే ఎల్‌ఎంవీ ఉంటే సరిపోతుందని చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ రవాణాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలపై ఇతర రాష్ట్ర అధికారులతోపాటు మోర్త్ ఆధికారులు ఆసక్తి కనబర్చినట్లు చెప్పారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...