అడ్డు తొలగించుకునేందుకే హత్య


Fri,February 15, 2019 01:12 AM

మంచాల/గోల్నాక: రామంతాపూర్, చెన్నారెడ్డినగర్‌లో సంచలనం సృష్టించిన వ్యక్తి హత్య...మూలాలు ఇబ్రహీంపట్నంలో లభ్యమయ్యాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ చెన్నారెడ్డినగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ను గుప్తనిధుల తవ్వకాల పేరుతో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆగాపల్లి రిజర్వు ఫారెస్టు లో హోంగార్డు వెంకట్రాంరెడ్డి, స్నేహితుడు నరేష్‌రెడ్డిలు హత్యచేసి పూడ్చిపెట్టినట్లు కేసు విచారిస్తున్న పోలీసులకు సమాచారం లభించింది. దీంతో అంబర్‌పేట్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆగాపల్లి ఫారెస్టులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు వెల్లడించడంతో గురువారం కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఆగాపల్లి రిజర్వు ఫారెస్టు ప్రాంతానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు, పోలీసుల సమక్షంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జొక్క చంద్రశేఖర్ (38)కు అదే ప్రాంతానికి చెందిన వరలక్ష్మితో 15 ఏళ్ల క్రితం వివా హం జరిగింది. పెళ్లి అయిన ఆరునెలలకే భర్త చంద్రశేఖర్, భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చి చెన్నారెడ్డినగర్‌లో నివాసముంటున్నట్లు చెప్పారు. అయితే, చంద్రశేఖర్ దివ్యాంగుడు కావడంతో దొరికిన పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. పటేల్‌నగర్‌కు చెందిన హోం గార్డు వెంకట్రాంరెడ్డి, వరలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా పదేపదే చంద్రశేఖర్ ఇంటికి వచ్చిపోతుండటంతో భర్త కు అనుమానం రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. వివాహే తర సంబంధం విషయం చంద్రశేఖర్ బంధువులకు తెలియడంతో వరలక్ష్మిని తీవ్రంగా మందలించినట్లు తెలిపారు.

దీంతో భర్త చంద్రశేఖర్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడైన వెంకట్రాంరెడ్డితో వరలక్ష్మి పక్కా ప్రణాళిక రచించినట్లు తెలిపారు. చంద్రశేఖర్‌కు గుప్తనిధుల తవ్వకాలంటే ఎనలేని ప్రేమ ఉండటంతో దీనిని ఆసరాగా తీసుకున్న వెంకట్రాంరెడ్డి విజయవాడకు చెందిన నరేష్‌రెడ్డితో హత్యకు ప్రణాళిక రచించారు. జనవరి 13న అంబర్‌పేట్ నుంచి చంద్రశేఖర్‌తో పాటు వరలక్ష్మి ప్రియు డు వెంకట్రాంరెడ్డి, అతని స్నేహితుడు నరేష్‌రెడ్డిలు కలిసి మం చాల పోలీసుస్టేషన్ పరిధిలోని ఆగాపల్లి అటవీప్రాంతానికి తీసుకువచ్చి పీకలవరకు మద్యం సేవించినట్లు చెప్పారు. అనంతరం దివ్యాంగుడైన చంద్రశేఖర్‌ను హత్యచేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా నగరానికి తిరిగి వెచ్చినట్లు తెలిపారు. అయితే, హత్యకు గురైన చంద్రశేఖర్ భార్య వరలక్ష్మి తన భర్త కనిపించడం లేదని జనవరి 24న అంబర్‌పేట్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, భార్యను విచారించగా విషయం బయటపడింది.

దీంతో సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ డీసీపీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు వెంట్రాంరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో గురువారం సాయంత్రం అంబర్‌పేట్‌తో పాటు మంచాల పోలీసులు నిందితులైన వెంట్రాంరెడ్డి, నరేష్‌రెడ్డిలను సంఘటన స్థలానికి తీసుకువచ్చి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి తీసుకువచ్చారు. పోలీసులు బంధువులు సమక్షంలో పాతిపెట్టిన చంద్రశేఖర్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు చంద్రశేఖర్‌కు ఇద్దరు కుమారులున్నట్లు తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...