సౌరశక్తి రంగంపై దృష్టి సారించండి


Fri,February 15, 2019 01:12 AM

ఘట్‌కేసర్:సోలార్ విద్యుత్ ఉత్పదనలో శిక్షణ పొందిన వారు ఒక్కొక్కరూ ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి అనంతకుమార్ హెగ్డే అన్నారు. ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో సూర్యమిత్ర ఐవోఎం సంస్థ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ఉత్పదన కోసం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల ముగింపు సమావేశం గురువారం జరిగింది. రాష్ట్రీయ విద్యా కేంద్రం కార్యదర్శి ఓం ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ ఇక్కడ తర్ఫీదు పొందిన విద్యార్థులు తమ ఉద్యోగ ఉపాధి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు. నిరుద్యోగ యువత సౌరశక్తి వినియోగ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని సమాజానికి సౌరశక్తి వినియోగం ఎంతో అవసరముందన్నారు. ఈ రంగం వైపు యువత దృష్టి సారించాలన్నారు. దేశవ్యాప్తంగా 70 శాతానికి పైగా సౌరశక్తిని వినియోగించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని వివరించారు. నిరుద్యోగ యువతకు సూర్యమిత్ర ఐవోఎం సంస్థ వారు శిక్షణ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ..అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, సురభి విధానాభివృద్ధి చైర్మన్ శేఖర్, బీజేపీ నేతలు నందకుమార్ యాదవ్, నానావత్ బిక్కునాథ్ నాయక్, సత్తిరెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...