సాంస్కృతిక వారసత్వానికి..నిలువుటద్దాలు


Thu,February 14, 2019 03:14 AM

-క్లాక్ టవర్ల పునరుద్ధరణ
-మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్
నిజాం కాలంలో ఏర్పాటు చేసిన క్లాక్‌టవర్ల పునరుద్ధరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలోని మహబూబ్ చౌక్, మోజంజాహీ మార్కెట్, సికింవూదాబాద్ క్లాక్‌టవర్లను ఇటీవలే జీహెచ్‌ఎంసీ పునరుద్ధరించింది. శాలిబండ, సుల్తాన్‌బజార్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లోని టవర్లను అరవింద్‌కుమార్ బుధవారం పరిశీలించారు. వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
సిటీబ్యూరో/చార్మినార్/బేగంబజార్/మారేడ్‌పల్లి, నమస్తే తెలంగాణ : నగరంలోని వివిధ కూడళ్లలో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్లకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల టవర్లను సందర్శించి అధికారులకు తగు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ పరిధిలో వందేండ్ల పైబడిన క్లాక్‌టవర్లు 12 ఉన్నాయి. ఇందులో తొమ్మిది హైదరాబాద్, మిగిలిన మూడు సికింవూదాబాద్ పరిధిలో ఉన్నాయి. కాగా, మహబూబ్ చౌక్, మోజంజాహీ మార్కెట్, సికింవూదాబాద్ క్లాక్‌టవర్ తదితర మూడింటిని ఇటీవలే జీహెచ్‌ఎంసీ పునరుద్ధరించింది. మిగిలిన ఎనిమిది టవర్లను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అరవింద్‌కుమార్ చార్మినార్, ముర్గీచౌక్ క్లాక్‌టవర్‌తోపాటు శాలిబండ వద్దనున్న కిషన్‌ప్రసాద్ దేవిడి సమీపంలోని క్లాక్ టవర్, సుల్తాన్‌బజార్, మోండా మార్కెట్‌లోని దండు క్లాక్ టవర్, మోండా మార్కెట్, ఉస్మానియా దవాఖాన తదితర ప్రాంతాల్లోని క్లాక్ టవర్లను పరిశీలించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న వాటిని వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉస్మానియా దవాఖాన పురాతన భవనంలో కొనసాగుతున్నందున పెచ్చులూడుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ దవాఖానకు విచ్చేసిన ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు విన్నవించారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన దవాఖాన స్థితిగతులపై నివేదికను సమర్పించాలని, ఆ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం మోండా మార్కెట్‌లోని చారివూతాత్మక కట్టడాలు అయిన పాత జైలుఖాన, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్‌లను సందర్శించి సదుపాయాలు, నిర్మాణ స్థితిగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాత జైల్ ఖానకు మరమ్మతులు నిర్వహించేందుకు స్థానిక వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టాలని సికింవూదాబాద్ జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్‌ను ఆదేశించారు.

క్లాక్ టవర్ల వివరాలు..
సికింవూదాబాద్ క్లాక్ టవర్‌ను 160లో 120 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ టవర్‌పై దీవాన్ బహదూర్ సేత్ లక్ష్మీనారాయణ్ రాంగోపాల్ ఈ గడియారాన్ని బహూకరించారు. 197 ఫిబ్రవరి 1వ తేదీన బ్రిటిష్ రెసిడెంట్ జాన్ చిఫేల్ ఫ్లోడెన్ దీన్ని ప్రారంభించారు
జేమ్స్ స్ట్రీట్ క్లాక్‌టవర్‌ను సేత్ రాంగోపాల్ 1900వ సంవత్సరంలో నిర్మించారు
సుల్తాన్‌బజార్ కోఠి ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన వద్ద క్లాక్‌టవర్‌ను 165లో బ్రిటిష్ వారు నిర్మించారు.
ఫతేమైదాన్ క్లాక్‌టవర్‌ను నిజాం ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఉన్న ఖుర్షిద్ జా బహదూర్ చిన్నకొడుకు నవాబ్ జఫర్‌యార్ జంగ్ 1903లో నిర్మించారు. 1904లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ దాన్ని ప్రారంభించారు
మోజంజాహీ మార్కెట్ క్లాక్‌టవర్‌ను ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన కుమారుడైన ప్రిన్స్ మోజంజా బహదూర్ పేరున మోజంజాహీ మార్కెట్‌లో 1933 నుంచి 1935 మధ్య కాలంలో నిర్మించారు
మహబూబ్ చౌక్ క్లాక్‌టవర్ - చార్మినార్ సమీపంలోని మహబూబ్‌చౌక్ వద్ద 174 నుంచి 177 మధ్య దీన్ని ఇండో-యూరోపియన్ శైలిలో నిర్మించారు. 192లో అస్మాన్ జా ఈ టవర్‌ను జాతికి అంకితం చేశారు
సెయింట్ జార్జ్ క్లాక్ టవర్‌ను సెయింట్ జార్జ్ చర్చ్‌లో ఏర్పాటు చేసిన ఈ క్లాక్‌టవర్‌ను అప్పటి చీఫ్ ఇంజినీర్ జార్జ్ విలియం రూపొందించారు. 167 ఏప్రిల్ 10న దీన్ని ప్రారంభించారు
చార్మినార్‌కు నలువైపులా ఉన్న గడియారాలను 19లో ఏర్పాటు చేశారు
శాలిబండ క్లాక్‌టవర్‌ను 1901లో రాజా శ్యాంరాజ్ బహదూర్ నిర్మించారు. ఈ క్లాక్‌టవర్‌పై భారీ గంట కూడా ఉండడం విశేషం.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...