స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావొద్దు


Thu,February 14, 2019 03:01 AM

చార్మినార్: విద్యార్థులు ప్రతి నిత్యం కొత్త విషయాలపై దృష్టి సారిస్తూ వాటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బుధవారం ట్రాఫిక్ పోలీసులు, ప్రైవేట్ పాఠశాలల సంయుక్తంగా నిర్వహించిన క్విజ్ పోటీల చివరి అంకం కార్య క్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచం కుగ్రామంగా మారి పోయిన ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతికతను ఒడిసి పట్టుకోవడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌లకు బానిసలుగా మారవద్దని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చిన్నప్పటి నుండే వాటిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేని ప్రయాణాలు చేయవద్దని సూచించారు. దక్షిణ మండలంలోని 27 పాఠశాలలకు చెందిన విద్యార్థులు క్విజ్ పోటీల్లో పాల్గొనగా 4 పాఠశాలలకు చెందిన విద్యార్థులు చివరి దశకు చేరుకున్నారు. జనరల్ నాలెడ్జ్‌తోపాటు అంతర్జాతీయ సంఘటనలపై చిన్నారులకు క్విజ్ పోటీలో ప్రశ్నలను సంధించారు. 15 రౌండ్‌లుగా సాగిన ఈ ప్రక్రియలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీపీ అంజనీకుమార్ బహుమతులను అందించారు. అదనపు సీపీ అనిల్‌కుమార్, ట్రాఫిక్ డీసీపీ బాబురావు, ఏసీపీలు నాగన్న, శ్రీనివాస్‌డ్డిలతోపాటు పలు స్టేషన్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...