నమ్మకమైనది.. నాణ్యమైనది


Thu,February 14, 2019 03:01 AM

- ప్రజారోగ్యమే లక్ష్యంగా విజయడెయిరీ ఉత్పత్తులు
- ప్రైవేటుకు దీటుగా ముందడుగు
-జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు
తార్నాక : నాణ్యమైన..నమ్మకమైన బ్రాండుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నది. ప్రైవేటుకు దీటుగా ముందడుగు వేస్తూ.. జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నది. స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తూ.. ప్రజల మన్ననలను చూరగొంటున్నది విజయడెయిరీ. లాభార్జనే ధ్యేయం కాకుండా ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్నదీ కార్పొరేషన్.
దినదినాభివృద్ధి చెందుతూ..
నాణ్యమైన పాల ఉత్పత్తులకు కేరాఫ్‌గా రాణిస్తున్న తెలంగాణ పాడిపరిక్షిశమ విజయడెయిరీ ప్రైవేటుకు దీటుగా ముందడుగు వేస్తున్నది. తాజాగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఐసీడీఎస్ అంగన్‌వాడీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు విజయడెయిరీ ద్వారా నిత్యం అందిస్తున్న పాలకు గుర్తింపు వచ్చింది. ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో కేంద్ర ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సేప్టీ శాఖ ప్రకటించిన 20 కేటగిరిల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయడెయిరీకి అవార్డు దక్కడం విశేషం. తెలంగాణ పాడిపరిక్షిశమ లాలాపేట విజయడెయిరీ నుంచి ప్రజారోగ్య సంక్షేమం కోసం నాణ్యమైన, పౌష్టికమైన పాలను అందిస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్నది.

పోషకాలతో కూడిన పాలు..
విజయడెయిరీ నుంచి వివిధ రకాలైన పాలను ప్రజలకు సరఫరా చేస్తుండగా, సంక్షేమ వసతి గృహాలకు, విద్యాసంస్థలకు ఫ్రెష్‌మిల్క్, టెట్రామిల్క్ రకమైన పాలను సరఫరా చేస్తూ విద్యార్థులు శారీరకంగా ఎదిగేందుకు తోడ్పడుతున్నది. ప్రతి రోజూ సంక్షేమ వసతిగృహాలకు, ఐసీడీఎస్‌కు సుమారు 30 వేల లీటర్ల చొప్పున పాలను సరఫరా చేస్తున్నది. విజయ పాలలో పోషక విలువలు ఉన్నట్లు జాతీయ పౌష్టికాహార సంస్థ శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. విజయ డెయిరీ నుంచి టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, స్టాండర్డ్ మిల్క్, ఫ్యామిలీ మిల్క్, ఆవు పాలు ,డైట్ మిల్క్, సుప్రభాతం మిల్క్, స్టైల్ మిల్క్‌తో పాటు వసతి గృహాలకు పంపించే పాల సరఫరాలో అదనంగా విటమిన్ ఏ, డీలు ఉన్నాయని, ఇవి ఎముకల్లో కాల్షియంను పెంపొందించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు ముంబై, ఢిల్లీ వంటి పెద్దపెద్ద పట్టణాల్లో 100 టన్నుల నెయ్యి, వెన్న 160 టన్నుల పెరుగు రోజూవారీగా సరఫరా చేస్తూ సేవలు విస్తరించుకుంటున్నది.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...