ఆర్ట్.. ఓ విద్యే..


Wed,January 23, 2019 12:47 AM

-రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
-ఆసక్తికితోడు నైపుణ్యాలే మూలం
-ఫైన్ ఆర్ట్స్ పట్ల తల్లిదండ్రుల దృక్పథం మారాలి
-‘కళ’ పేరుతో ‘షార్ట్ ఫిల్మ్’ రూపొందించిన మహీ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆర్ట్(కళ) అనేది గాడ్ గిఫ్ట్. ఫైన్ మీద ఉన్న ఆసక్తికి కాస్తంత నైపుణ్యతను జోడిస్తే.. అద్భుతాలు సృష్టించవచ్చన్నది అక్షరాల వాస్తవం. ఫైన్ ఆర్టిస్ట్ చేసే ఒక్కో కళాఖండం ఓ అద్భుతం.. ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వారు గీసే ఒక్కో కళాఖండం.. రూ.కోట్లలో పలుకుతుందనేది అందరికీ తెలిసిందే. చిత్రలేఖనం అంటే చాలామందికి బొమ్మలు గీయడం అని మాత్రమే తెలుసు. దాని విలువ, ప్రతిభ, ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. చిత్రలేఖనానికి సంబంధించి ప్రత్యేకంగా కోర్సు ఉంది.. దానికంటూ ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ ఉందనే విషయం అరుదుగా తెలుసు. ఓ వైపు ఫైన్ ఆర్ట్స్ చదువుకుంటూనే యాడ్ ఏజెన్సీ, ప్రెస్ ఫొటోగ్రఫీ, మీడియా సంస్థలు, ఎగ్జిబిషన్ షో వంటి వాటి ద్వారా సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంకోసం ఎదురు చూడకుండా ఆర్ట్స్ ద్వారా జీవనం సాగించవచ్చు.

కనుమరుగైపోతున్న క్రమంలో..
ఫైన్ కనుమరుగైపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఫైన్ ఆర్ట్స్ బతికించేందుకు ఓ వ్యక్తి చేస్త్తున్న కృషి అభినందనీయం. మసాబ్ ట్యాంక్ జవహర్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ విధులు నిర్వహిస్త్తున్న మహీ కోమటిరెడ్డి.. ఫైన్ ఆర్ట్స్ బతికించేందుకు ‘కళ’ పేరుతో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఫైన్ అంటే సమాజంలో ఉన్న చిన్నచూపును దూరం చేయాలని.. దానిలోనూ ఓ ఉజ్వల భవిష్యత్తు ఉందనే వాస్తవాన్ని సమాజానికి పరిచయం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మహీ.. కేవలం వచ్చామా.. తన పని చేశామా అన్న ధోరణిలో కాకుండా అద్భుతం దాగి ఉన్న కళలను వెలుగులోకి తేవాలని ఆరాటపడుతున్నారు. ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక విద్యే. దానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. విద్య అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాదు.. ఆయా కళలపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహిస్తూ.. అందులో నైపుణ్యాన్ని తీర్చిదిద్దేందుకు జేఎన్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించినట్టు ఆయన చెబుతున్నారు.

దూరదర్శన్ ప్రోగ్రామ్స్..
మహీ కోమటిరెడ్డి.. సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్ పాటు దూరదర్శన్ పలు ప్రోగ్రామ్స్ చేశారు. అంధ దంపతుల మీద దూరదర్శన్ ‘గాజు కళ్లు’ పేరుతో తీసిన ఎపిసోడ్ నంది అవార్డు సైతం వచ్చింది. ఈ ఎపిసోడ్ అంధ దంపతులు కష్టపడి కొడుకును పెంచిపెద్ద చేస్తే.. అతను తల్లిదండ్రుల జీవితచరమాంకంలో ఎలా చూసుకున్నారన్న అంశాన్ని స్పష్టంగా చూపించారు. దీంతో పాటు ‘జీవన రాగాలు’ అనే సీరియల్ 26 ఎపిసోడ్స్ చేశారు. సినిమాలోకం, హిందీలో అనాథ పిల్లల మీద ‘మా’(అమ్మ) సీరియల్ సైతం చేశారు. గతంలోనూ కొన్ని చిత్రాలకు పనిచేసిన అనుభవం ఉండడంతో సొంతంగా ఫైన్ ప్రాధాన్యతను తెలిపే షార్ట్ రూపొందించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...