బల్దియా ‘స్వచ్ఛ సేన’!


Wed,January 23, 2019 12:46 AM

నగరంలో ఎక్కడా వ్యర్థాలు లేకుండా చూడడమే లక్ష్యంగా జీహెచ్ సరికొత్త వ్యవస్థను ఏర్పాటుచేస్తుంది. ‘స్వచ్ఛ సేన’ పేరుతో పారిశుధ్య జవాన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులుగల బృందాలను వార్డుకొకటి చొప్పున రంగంలోకి దింపాలని నిశ్చయించింది. ఈ బృందాలపై సర్కిల్ ఒకరు చొప్పున పర్యవేక్షకుడిని నియమించాలని, అలాగే, ఈ బృందాలన్నీ పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ ఆధీనంలో పనిచేసేలా చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనంత తొందరలోనే ఈ బృందాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన అధికారులు ఫిబ్రవరి చివరివరకూ నిబంధనలను ఉల్లంఘించేవారికి ఉచిత చలాన్ విధించి మార్చి నుంచి పకడ్బందీగా జరిమానాలు వసూలు చేయాలని సంకల్పించారు. మాటిమాటికీ నిబంధనల ఉల్లంఘన పునరావృతంచేస్తే జరిమానాలు పెంచుతూ చివరికి వారి దుకాణాలను, డెబ్రిస్ అయితే వాహనాన్ని సీజ్ నిర్ణయించారు.

మున్సిపల్ నిబంధనల ప్రకారం రోడ్లపై మూత్ర విసర్జన, చెత్త, డెబ్రిస్ వేయడం, నాలాల్లో వ్యర్థాలు వేయడం నేరం. ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి జరిమనాలు విధించే వెసులుబాటు బల్దియా చట్టంలో ఉంది. అయితే నిబంధనల అమలు సక్రమంగా సాగడంలేదు. అనాథిగా వస్తున్న అలవాట్లను మార్చుకునేందుకు ప్రజలు ఆసక్తిచూపకపోవడం, ఒకేసారి జరిమానాలు విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదనే ఉద్దేశంతో జీహెచ్ నిబంధనల అమలుకు వెనకాడడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఫలితంగా స్వచ్ఛత కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించినస్థాయిలో మార్పు రావడంలేదు. అయితే రానున్నరోజుల్లో ప్రభుత్వం నగరంపై ప్రత్యేక దృష్టిసారించి పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దీనికోసం నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ‘స్వచ్ఛ సేన’ను ఉపయోగించుకోనున్నారు.

డ్రెస్ అత్యాధునిక హంగులు...
గత ఏడాది ఏర్పాటుచేసిన డీఆర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాల తరహాలోనే వీరికి కూడా డ్రెస్ నిర్థారించారు. డీఆర్ బృందాలకు నీలంరంగు యూనిఫాం ఉండగా, అదేతరహాలో వీరికి ఆకుపచ్చ యూనిఫాం ఉంటుంది. నల్ల రంగు టోపీ, బూట్లు, బెల్టు ఉంటాయి. ఒక్కో బృందానికి ఒకటి చొప్పున బొలేరో, లేక స్కార్పియో వాహనాన్ని సమకూర్చాలని నిశ్చయించారు. ఈ వాహనాలకు కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానమై ఉంటుంది. వీరికి జరిమానా విధిందే అధికారం ఉంటుంది. నేరాన్ని పునరావృతం చేసేవారికి జరిమానా పెరుగుతూ ఉంటుంది. చివరికి వారి దుకాణం, లేక వ్యర్థాలు వేసే వాహనం సీజ్

ఫిర్యాదులపై నిమిషాల్లో స్పందన
ఎవరైనా సెల్ ద్వారా ఫిర్యాదుచేస్తే వెంటనే అది సంబంధిత స్వచ్ఛసేన బృందానికి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే వారు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని నేరం చేసేవారిని పట్టుకొని జరిమానా విధిస్తారు. ఈ బృందాలకు ఫిర్యాదుచేసేందుకు ఓ టోల్ నంబర్ కూడా ఏర్పాటుచేయనున్నారు. స్వచ్ఛ సేన బృందాలు షిఫ్టులవారీగా మూడు షిఫ్టుల్లో పనిచేస్తాయి. ఈనెలాఖరుకల్లా బృందాలు సిద్ధమవుతాయి. ముందుగా ఒక్కో సర్కిల్ రెండు-మూడు చొప్పున బృందాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేస్తారు. ఫిబ్రవరి చివరికల్లా అన్ని వార్డులకూ బృందాలు ఏర్పాటుచేసి మార్చి ఒకటినుంచి పకడ్బందీగా జరిమానాలు వసూలుచేస్తారు. స్వచ్ఛతలో టోక్వో, సింగపూర్ తదితర అంతర్జాతీయ నగరాల సరసన మన నగరానికి కూడా చోటు కల్పించేందుకు ఇటువంటి చర్యలు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...