-డీఈఓ వెంకటనర్సమ్మ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలల్లోని ‘ఉత్తమ నాయకత్వ విధానాల’ నివేదికలకు సంబంధించిన కేస్ స్టడీలను జనవరి 31వ తేదీలోపు స్కూల్ లీడర్ అకాడమీ(ఎస్ పంపించాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల నాయకత్వానికి సంబంధించిన ఉత్తమమైన నివేదికలను 2500నుంచి 3వేల పదాలకు మించకుండా ‘పాఠశాల రూపాంతరీకరణ’ దిశలో ప్రధానోపాధ్యాయులు, ఇతరులు చేస్తున్న కృషిని పంపించాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్: 94404 05244 నంబర్ సంప్రదించాలని పేర్కొన్నారు. దీంతోపాటు పాఠశాల నాయకత్వ జాతీయ కేంద్రం, విద్యా ప్రణాళిక, పరిపాలన జాతీయ సంస్థ(ఎన్ ఎన్ సంయుక్తంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల కోసం ‘పాఠశాల నాయకత్వం- నిర్వహణ’పై ఆన్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తుందని వివరించారు. రెండున్నర నెలల కాలపరిమితితో ఉండే ఈ కోర్సుకు ఆన్ ఈనెల 29వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కోర్సుకు ఎలాంటి ప్రవేశ రుసుం లేకుండా ఆన్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.