‘పీవీఎన్ కొత్త సొబగులు


Tue,January 22, 2019 01:24 AM

- పిల్లర్లకు పచ్చందాలు..రహదారి నిర్మాణం
- రూ. 23 కోట్లతో పనులు
- త్వరలో టెండర్ల ఆహ్వానం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నిర్వహణలో భాగంగా ఎక్స్ వే మార్గం మొత్తంలో పాత స్థానంలో కొత్తగా బీటీ రోడ్డు, పెయింటింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. త్వరలోనే ఈ పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పనులతో పాటుగా ఎక్స్ వే పిల్లర్లకు కనువిందు చేసేలా పచ్చని అందాలను పరిచయం చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్య కూడళ్లు (జంక్షన్లు), యూ టర్న్ చేసే చోట్ల పిల్లర్లకు వర్టికల్ గార్డెన్లు తీర్చిదిద్దాలని నిర్ణయించి ఈ మేరకు అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

మరో ర్యాంపు..
పీపీ నర్సింహారావు ఎక్స్ వే మార్గంలో మరో ర్యాంపు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
లక్ష్మీనగర్, బుద్వేల్, అరాంఘర్ జంక్షన్ ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేందుకు హైదర్ సమీపంలో ర్యాంపు ( ఎగువ ర్యాంపు/దిగువ ర్యాంపు) నిర్మాణం చేపట్టనున్నారు. శంషాబాద్ ఎయిర్ నుంచి టౌలీచౌకి, మెహిదీపట్నంకు చేరుకునే వాహనాలు మాసబ్ వరకు వచ్చి మళ్లీ యూ టర్న్ ద్వారా మెహిదీపట్నం జంక్షన్ రావాల్సి వస్తుండడం, ప్రధానంగా ఆత్తాపూర్ నుంచి మెహిదీపట్నం మార్గంలో ట్రాఫిక్ అత్యధికంగా ఉంటుందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు..
రూ. 36 కోట్ల అంచనా వ్యయంతో..
రూ. 36 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనపై పరిపాలన అనుమతుల కోసం హెచ్ ప్రభుత్వానికి అందజేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకురానున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...