బల్దియా వినూత్న విధానాలపై యువ ఐఏఎస్ అధ్యయనం


Tue,January 22, 2019 01:01 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్ ప్రధానమంత్రి ఎక్స్ అవార్డులు సాధించిపెట్టిన వివిధ వినూత్న విధానాలపై అధ్యయనం నిర్వహించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది యువ ఐఏఎస్ ట్రైనీలు అధికారులు సోమవారం జీహెచ్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ఆయా కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఆదాయం పెంపుపై- పన్నుల భారం మోపకుండా ఆదాయం పెంచుకున్న వైనాన్ని రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ అద్వైత్ వివరించారు. అండర్ అసెస్ అన్ అసెస్డ్ ఆస్తులను పన్ను వసూళ్ల పరిధిలోకి తేవడం, విద్యుత్ కనెక్షన్లు, వాణిజ్యశాఖ, ట్రేడ్ లైసెన్సులు తదితర వివరాల ఆధారంగా వాణిజ్య భవనాలను గుర్తించడం తదితర చర్యల ద్వారా అన్ని భవనాలను పన్ను పరిధిలోకి చేర్చి పన్నులు వసూలు చేసిన విధానాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎర్లీబర్డ్ స్కీమ్, ట్రేడ్ లైసెన్సులు, ప్రకటనల పన్ను, ఇంటి అనుమతుల పన్ను తదితర అంశాలను కూడా వారికి వివరించారు.

మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సేకరణపై- వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్ ప్రభుత్వాలపై ఆధార పడకుండా తమ పరపతిని ఉపయోగించుకోవడం ద్వారా మున్సిపల్ బాండ్లను జారీచేసి సొంతంగా నిధులు సమకూర్చుకున్న విధానాన్ని అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ వివరించారు. అలాగే, వీధిలైట్లు, రోడ్లు, పార్కుల నిర్వహణ, నాలాల పూడికతీత తదితర పనులకోసం నిధులు వెచ్చిస్తున్నతీరును ఆయన సవివరంగా తెలియజేశారు. డబుల్ బెడ్ ఇళ్ల పథకంపై- దేశంలోనే ఆదర్శంగా మారిన పథకాన్ని చీఫ్ ఇంజినీర్ సురేశ్ కుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు, ముఖ్యంగా మురివాడల్లో నివసించే ప్రజలను ఖాళీచేయించేందుకు తీసుకున్న చర్యలను ఆయన తెలిపారు. అలాగే, ఎక్కడివారికి అక్కడే ఇండ్లను నిర్మించే కార్యక్రమంలో భాగంగా తక్కువ స్థలంలో ఎక్కువమందికి ఇండ్లను నిర్మించేందుకుగాను ఎత్తయిన అపార్ట్ నిర్మిస్తున్నతీరును వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణ- అనంతరం ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా వ్యర్థాల సేకరణ నుంచి డంపింగ్ నిర్వహిస్తున్నతీరు అన్ని అంశాలను వివరించారు. అలాగే, ఇప్పటికే పేరుకుపోయిన వ్యర్థాల క్యాపింగ్ పనులను కూడా వారికి తెలిపారు. దీంతోపాటు ఫుట్ ఆక్రమణల తొలగింపు, ఆక్రమణల కూల్చివేత, విపత్తుల నిర్వహణ బృందాల పనితీరు తదితర అంశాలను కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. జీహెచ్ అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...