ముగిసిన గులాబీ ప్రదర్శన


Tue,January 22, 2019 01:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో 19న ప్రారంభమైన 37వ ఆలిండియా వార్షిక గులాబీల ప్రదర్శన సోమవారం ముగిసింది. ఈప్రదర్శనను ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ మూడు రోజుల పాటు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని దివంగత నవాబ్ షా అలంఖాన్ స్మృతి నేపథ్యంలో ఏర్పాటు చేశారు. ఆది, సోమవారాల్లో గులాబీల ప్రేమికులు ప్రదర్శనను వీక్షించేందుకు పెద్ద ఎత్తున విచ్చేశారు. అఖిల భారత గులాబీ పూల ప్రదర్శన వచ్చేసిన దేశీయ, విదేశీ ప్రతినిధులంతా నగరంలోని పలు పార్కులను, గార్డెన్లను పలు ప్రాంతాల్లో కలియతిరిగి చూశారు. ఇందిరా పార్కులోని గులాబీ వనాన్ని, సంజీవయ్య పార్కు, నగర శివారులోని గ్రీన్ వ్యాలీ పార్కు తదితర పార్కులను వారు సందర్శించారు. ఇందులో 500 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఫ్లవర్ కాంపిటేషన్ కూడా నిర్వహించారు. 300 పై చిలుకు గులాబీలను ప్రదర్శనలో పెట్టారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ రోజ్ ఫెడరేషన్, ప్రెసిడెంట్, వరల్డ్ రోజ్ కన్వెన్షన్ కమిటీ చైర్ పర్సన్ ‘హెల్గా బ్రిచెట్’, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ రోజ్ సొసైటీ, ప్రెసిడెంట్ ‘హెన్రీయన్’, హైదరాబాద్ రోజ్ సొసైటీ ప్రెసిడెంట్ నవాబ్ అహ్మద్ అలంఖాన్, సెక్రటరీ విజయ్ కాంత్, కోశాధికారి డాక్టర్ ఏవీ రావు, డాక్టర్ ఏ.ప్రసాద్ (కాన్పూర్), మెహితీ (కలకత్తా), డాక్టర్ ఏపీ సింగ్ (ఢిల్లీ) తదితరులు పాల్గొన్నారు.

అవార్డుల బహూకరణ
ప్రిన్సెస్ గులాబీగా థానే వైసవ రిస్టార్ట్ నుంచి వచ్చిన ‘గ్రీన్ ఐస్’; ప్రిన్స్ థానే జిల్లా వంగరి నుంచి ఆశిష్ డీ మోర్ (రోజ్ బ్రీడర్, కన్సల్టెంట్) తెచ్చిన ‘సమ్మర్ స్నో ఫ్లవర్’లు అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఇంకా గులాబీలలో క్వీన్, కింగ్ నాగ్ నుంచి ఎం.ఆర్.తిజారే తెచ్చిన ‘లవ్ రోజ్’, ‘లేడీ బర్డ్’ గులాబీలు అవార్డును గెల్చుకున్నాయి. ఆయా గులాబీలను పోటీకి తెచ్చిన రోజీయన్లకు బహుమతులు, ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను ‘హైదరాబాద్ రోజ్ సొసైటీ’ వారు అందజేశారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...