ఆక్రమణలను కూల్చేయాలి..


Tue,January 22, 2019 01:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని జిల్లా ఇన్ కలెక్టర్ జి. రవి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణిలో ముషీరాబాద్ మండల పరిధిలోని గంగపుత్రకాలనీలో కమ్యూనిటీ హాల్ పక్కన గల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆక్రమణలను కూల్చివేసి, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరుతూ గంగాభవానీ యూత్ అసొసియేషన్ సభ్యులు కలెక్టర్ వినతిపత్రం అందజేయగా, ఇన్ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. సికింద్రాబాద్ ఆర్డీవో ఈ స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలను తొలగించాలన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన 74 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించి ఆన్ ఆప్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు, రుణాలు, ఇండ్లు, పింఛను తదితర అంశాలపై ఇన్ డీఆర్ వెంకటేశ్వర్లు, ఆర్ శ్రీనివాస్ రాజాగౌడ్ కలిసి పిటిషన్లను స్వీకరించారు. వాటిలో కొన్నింటి వివరాలిలా..
-తన భర్త గుండె నొప్పితో మరణించాడని, ఎలాంటి ఆధారం లేని తనకు వితంతు పింఛను మంజూరుచేయాలని కోరుతూ ఆసిఫ్ మండలం జియాగూడకు చెందిన పూజ పిటిషన్ సమర్పించింది. ఆసిఫ్ తహసీల్దార్ ఈ పిటిషన్ పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
- ప్రీ స్కూల్ టీచర్లుగా పనిచేస్తున్న తమకు 6 మాసాలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక, రానుపోను దారి ఖర్చులకు సైతం ఇబ్బందులు పడుతున్నామని, కనుక పెండింగ్ జీతాలను ఇప్పించాలని కోరుతూ యూసుఫ్ శిశువిహార్ ఉద్యోగులు పిటిషన్ సమర్పించారు. జిల్లా సంక్షేమాధికారికి ఈ పిటిషన్ అందజేసి, జీతాలను చెల్లించాలని సూచించారు.
- 600 కుటుంబాలు ఉన్న తమ బస్తీలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని, ఈ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ అడ్డగుట్ట శాస్త్రీనగర్ చెందిన రుద్రవీణ మహిళా అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో తగు చర్యలు తీసుకోవాలని ఇన్ కలెక్టర్ సూచించారు. సీపీవో రామభద్రం, జిల్లా సంక్షేమాధికారి ఝాన్సీలక్ష్మి, బీసీ సంక్షేమాధికారి విమలాదేవి, మైనార్టీ సంక్షేమాధికారి మహ్మద్ ఖాసీం, డీఎస్ రాథోడ్, డిప్యూటీ కలెక్టర్ రాధికారమణి, ఎంప్లాయీమెంట్ అధికారిని మైత్రిప్రియ తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...