బాలురకు దీటుగా బాలికలు..


Tue,January 22, 2019 12:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆడపిల్ల అమూల్యమైన వజ్రం.. సకల శక్తియుక్తులు గల ఆడపిల్లలు ఒక్క చదువే కాదు అన్నింటిలో తమ సత్తాను చాటుకుంటున్నారు. తామేందులో తీసిపోమని, అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. క్రీడ లు, ఆటలు, చదువు, కళా సాంస్కృతిక రంగాలన్నింటిలో తమదైన ప్రతిభను కనబరుస్తున్నారు. ఆత్మైస్థెర్యంతో ముందుడుగేస్తున్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బేటి బచావో - బేటి పడావో వారోత్సవాన్ని నిర్వహిస్తున్నది. జనవరి 21వ తేదీ నుంచి 26 వరకు పలు రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ఝాన్సీలక్ష్మి, జిల్లా బాలల సంక్షేమాధికారి ఇంతియాజ్ రహీం తెలిపారు. సోమవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బెట్టర్ టుమారో’ నినాదంతో ఈ వారోత్సవాలను నిర్వహించనున్నామన్నారు. 25 వేల ఇండ్లకు స్టిక్కర్లను అంటించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ నెల 24న జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ, ఐఏఎస్ విజయేంద్ర బోయి, యువ కో- ఆర్డినేటర్ డా. హిమబిందు, సహా పలువురు నిపుణులు హాజరై ఆడపిల్లలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...