‘స్వచ్ఛత’లో మెరుగైన ర్యాంకుకు తోడ్పడాలి


Tue,January 22, 2019 12:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : స్వచ్ఛ సర్వేక్షణ్-2019 సర్వేలో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ చెందిన బృందం గత రెండురోజులుగా నగరంలో ఉన్నట్లు, ఓడీఎఫ్ ప్లస్ వారు అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పి స్వచ్ఛ సర్వేక్షణ్ నగరానికి మెరుగైన ర్యాంకు సాధించేందుకు తోడ్పడాలని జీహెచ్ కమిషనర్ ఎం. దానకిశోర్ నగరవాసులకు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకుగాను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ)కి రాష్ట్రస్థాయి పురస్కారం లభించిందని, అధికారులు, సిబ్బంది సంయుక్త కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల నమోదుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారి సౌకర్యార్థం ఈనెల 22, 23, 24 తేదీల్లో సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల మధ్య పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని అందుబాటులో పెడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా పేర్లు నమోదుచేసుకోవడమే కాకుండా జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ సరిచూసుకోవచ్చని, తప్పొప్పులు సవరించుకోవ్చని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల సం దర్భంగా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతుపై ఇంటింటీ సర్వే నిర్వహించి ఎవరైనా ఓటర్లు ఉన్నట్లు తేలితే మళ్లీ వారికి జాబితాలో స్థానం కల్పిస్తామన్నారు. ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ వరకు 18సంవత్సరాలు నిండినవారు ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల సౌకర్యార్థం అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రాప్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. ప్రజలు, వీఐపీలు జీహెచ్ పోర్టల్, సీఈఓ పోర్టల్ ద్వారా జాబితాలో పేర్లు ఉన్నది, లేనిది పరిశీలించుకోవాలని కోరుతూ, దీనికోసం ఓటర్ల జాబితా సవరణ తుది గడువును ఈనెల 25కు బదులు వచ్చే ఫిబ్రవరి నాలుగవ తేదీవరకు పొడిగించినట్లు కమిషనర్ వివరించారు. ఈ మేరకు సీఈఓ ఇప్పటికే నగరవాసులకు లేఖలు విడుదలచేసినట్లు తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...