‘రోషన్ సమస్యకు పరిష్కారం..


Tue,January 22, 2019 12:55 AM

హస్తినాపురం, జనవరి 21: దశాబ్దాలుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతున్న రోషన్ కాలనీ తరలింపు సమస్య ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ కృషితో పరిష్కార దశకు చేరింది. ఈమేరకు కాలనీ తరలించి పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.81.53కోట్ల మంజూరు లభించింది. సంబంధిత పత్రాలను సోమవారం కాంచన్ డీఆర్ కేంద్ర కార్యాలయంలో.. డీఆర్ మేనేజింగ్ సర్వీసెస్ డైరెక్టర్ ఎస్.ఎస్ పన్వార్, డీఆర్ డైరెక్టర్ భాస్కర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి చమన్ చేతుల మీదుగా స్థానిక కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ రూ.81.53కోట్ల మంజూరు పత్రాలను అందజేశారు. కాలనీ తరలింపు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్, డీఆర్ అధికారులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు లక్ష్మయ్య, రవి, పెంటయ్య, జగన్, డేవిడ్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...