త్వరలో మంగళ్ లాజిస్టిక్ పార్కు ..!


Tue,January 22, 2019 12:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ ‘మహా’ నగరాభివృద్ధి సంస్థ (హెచ్ చర్యలు తీసుకుంటున్నది. వస్తువుల రవాణాకు ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్ చుట్టూ లాజిస్టిక్ పార్కులను నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ (పీపీపీ) పద్ధ్దతిలో బాటాసింగారంలో రూ. 35 కోట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో, మంగళ్ రూ.20కోట్లతో 20ఎకరాల్లో పనులకు శ్రీకారం చుట్టారు. ఔటర్ సమీపంలో నాగార్జున సాగర్ హైవే, మరోకటి విజయవాడ హైవేలో ఈ నిర్మాణ పనులకు చేపట్టగా, ఇందులో మంగళ్ లాజిస్టిక్ పార్కు పనులు ఇప్పటికే దాదాపు 60 శాతం పనులు పూర్తి చేసుకున్నాయి. దీంతో వచ్చే నెలలో తొలివిడతగా మంగళ్ పార్కును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరకనున్నది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...