ఒంటరి మహిళలే టార్గెట్


Tue,January 22, 2019 12:53 AM

- పూజల పేరుతో దృష్టి మళ్లించి.. దోచుకున్న ఇరానీ గ్యాంగ్
- గత ఏడాది అక్టోబర్ 6 ఘటనలు
- ప్రధాన నిందితుడు అరెస్ట్.. 32తులాల ఆభరణాలు స్వాధీనం
- దేశవ్యాప్తంగా 39 ప్రాంతాల్లో 59 ఇరానీ గ్యాంగ్ ముఠాలు
- సీసీ కెమెరాలతో నిందితుల గుర్తింపు
- సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దుకాణాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ... పూజల పేరుతో దృష్టి మళ్లిం చి దోచుకుంటున్న ఇరానీ గ్యాంగ్ ప్రధాన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 5 గంటల్లో ఆరు ఘటనలకు పాల్పడి... 32 తులా ల బంగారు ఆభరణాలను దోచుకున్న కీలక సూత్రధారిని సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారులకు నగరంలో స్థావరం కల్పించిన ముఠాలోని ఇద్దరు సభ్యులను గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.
గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వివరాలను వెల్లడించారు. ముంబై జైలులో పరిచయమైన వాసిమ్ అబ్బాస్ సిరాజ్, జైకుమార్ రజాక్, నియాజ్ మహ్మద్ ఖాన్, జా విద్ బాలీలు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్నారు. దీని కోసం బ్యాంకులు, రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ వద్ద మాటు వేసి... నోట్లు లెక్కిస్తామని, నోట్లను కింద పడేసి.. ఈ నోటు మీదా అని, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీస్ తనిఖీలంటూ హడావిడి చేసి అమాయకుల నుంచి నగదు, బంగారాన్ని దోచుకు న్నారు. అయితే వీరి నేరప్రక్రియ పోలీసులతో పాటు ప్రజలకు కూడా తెలిసిపోవడంతో సరికొత్త నేరప్రక్రియతో మహిళలను దోచుకోవాలని స్కెచ్ వేశారు.

ముంబై జైలు నుంచి విడుదలైన తర్వాత నియాజ్ మహ్మద్ ఖాన్ హైదరాబాద్ వచ్చి రాజేంద్రనగర్ ప్రాంతం లో ట్రాన్స్ నిర్వహిస్తున్నాడు. తమ పథకంలో భాగంగా వాసిమ్ అబ్బాస్ సిరాజ్, జైకుమార్ రజా క్, జావిద్ బాలీలు అతన్ని సంప్రదించి సెప్టెంబర్ నగరానికి వచ్చారు. అదే నెల 22న రెండు బైక్ రాజేంద్రనగర్, నార్సింగి, శంషాబాద్, మైలార్ ,పహాడీషరీఫ్ ప్రాంతాల్లో తిరిగి ఒంటరిగా మహిళలు ఉన్న దుకాణాలను పరిశీలించారు. అనంతరం వాసిమ్ అబ్బాస్ సిరాజ్, జావీద్ బాలీలు హోండా యాక్టీవాపై కుంకుమ గంధం బొట్టు పెట్టుకుని ఉండగా, జైకుమార్, నియాజ్ అహ్మద్ వీరి వెనుకాల అనుసరించి... 5 గంటల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో కిరాణా దుకాణా లు, ఇంటి బయట కూర్చున్న మహిళలను పూజలతో పలుకరించి దోచుకున్నారు. మొత్తం 32 తులాలను ఎత్తుకెళ్లిపోయారు.

ఇరానీ గ్యాంగ్ అటెన్షన్ డైవర్షన్ ఇలా...
మొదట ఒంటరిగా ఉన్న మహిళ ఉన్న దుకాణానికి వెళ్లి గంధం, అగరబత్తీలు కొనుగోలు చేస్తూ ఆమెను పలకరిస్తారు. దానం చేయడానికి బయటి నుం చి వచ్చాం... గుడిలో ఎవరు లేరు... మీరే ఈ దానాన్ని ఇతరులకు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత తీసుకొచ్చిన పూజసామగ్రితో పాటు రూ.1100 లు ఇచ్చి దానం చేయమంటారు. అదే సమయంలో ఈ రోజు చాలా పవిత్రమైన దినం.. మీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి మేము పూజ చేసిన సామగ్రిని తాకించి... నోటులో చుట్టి పెడితే మీ కష్టాలు పోయి మంచి జరుగుతుందని నమ్మిస్తారు. ఆ సందర్భంలోనే బంగారం గొలుసును వేళ మధ్యలో పెట్టుకుని బ్యాగులోనే పెడుతున్నట్లు బురిడీ కొట్టించి ఐదు నిమిషాల తర్వాత తీయమని చెప్పి అక్కడి నుంచి పరారవుతారు.

సీసీ కెమెరాలతో పట్టుబడ్డారు....
గత ఏడాది అక్టోబర్ జరిగిన ఈ వరుస సంఘటనలు నగరంలో తీవ్ర కలవరం రే పింది. ఈ కేసు మిస్టరీని సవాలుగా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా అనుమానితుల ఫొటోలను సేకరించి నేరానికి పాల్పడింది ముంబై అంబేవాల్లీ ప్రాంతానికి చెందిన వాసిమ్ అబ్బాస్ ఇరానీ ముఠాగా గుర్తించారు. నవంబర్ 5న ఈ ముఠాకు సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేసి, ప్రధాన నిందితుల కోసం మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో గాలించి సోమవారం వాసిమ్ అబ్బాస్ సిరాజ్ అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరా రీలో ఉన్నాడు. దర్యాప్తులో ఈ ముఠా ముంబై, థానే, వా రణాసి, అలహాబాద్, బీహార్ రాష్ట్రాల్లో దృష్టి మళ్లించి 58 నేరాలకు పాల్పడినట్లు తేలింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ఇరానీ ముఠాలు 59 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలు మొత్తం 39 ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకున్నాయని సైబరాబాద్ స్పెషల్ టాస్క్ టీం ఏసీపీ శ్యాంబాబు, ఇన్ సుధీర్ జానయ్య బృందం తెలిపింది. ప్రతి ఏడాది సరికొత్త నేరప్రక్రియతో ఈ ఇరానీ గ్యాంగ్ దృష్టి మళ్లించి దోచుకునేందుకు పథకాలు వేస్తుందని తెలిసింది. ఈ ముఠాను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామని సీపీ సజ్జనార్ చెప్పారు.

సైబరాబాద్ 60వేల సీసీ కెమెరాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 60 వేల సీసీ కెమెరాలు ఏర్పాటైయ్యాయని, ఇంకా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో శంషాబాద్ , మాదాపూర్ డీసీపీలు ప్రకాష్ వెంకటేశ్వరరావు, ఎస్ అదనపు డీసీపీ దయానంద్ స్పెషల్ టాస్క్ ఏసీపీ శ్యాంబాబు, పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించిన స్పెషల్ టాస్క్ టీంతో పాటు సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులను అందించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...