ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు


Mon,January 21, 2019 01:08 AM

- స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుకు అవకాశం
- ఇంకా దరఖాస్తు చేసుకోని 8,064 మంది విద్యార్థులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల దరఖాస్తుల ప్రక్రియ ఆఖరు దశకు చేరుకుంది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వృత్తివిద్యాకోర్సులు చదువుకుంటున్న వారికి సర్కారు ఇస్తున్న ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం వరంగా మారి ఉపయోగపడుతున్నది. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులకు బోధనారుసుములు, స్కాలర్‌షిప్పులను ఇస్తున్నది. రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూ షన్ ఫీజు (ఆర్‌టీఎఫ్)ను సెప్టెంబర్, మార్చి మాసాల్లో, మేయింటెనెన్స్ ఛార్జీ లు/ మెస్ ఛార్జీలను ప్రతి నెల నెలా విద్యార్థులకు అందజేస్తున్నది. 2018 -19 విద్యాసంవత్సరానికి గాను స్కాలర్‌షిప్పుల దరఖాస్తుల గడువు అక్టోబర్‌లో ప్రారంభమయ్యింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయినా కొంత మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో జనవరి 31 వరకు గడువును పొడగించారు. అయినా ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 8064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. జిల్లాలో మొత్తంగా 80,459 మంది అర్హులైన విద్యార్థులుండగా, ఇప్పటి వరకు 72,395 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 8,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు.

పుష్కలంగా బడ్జెట్..
బోధనా రుసుములు, స్కాలర్‌షిప్పుల కోసం జిల్లాలో బడ్జెట్ పుష్కలంగా అందుబాటులో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్నిశాఖల్లో నిధులు పుష్కలం గా అందుబాటులో ఉన్నాయి. కాని నిధులు ఉన్నా.. బడ్జెట్ మంజూరైనా విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. ఇది వరకు బోధనా రుసుములు, స్కాలర్‌షిప్పుల కోసం విద్యార్థులు వేయికండ్లతో వేయిచూసిన సందర్భాలున్నాయి. దరఖాస్తు చేస్తే వస్తుందో రాదో తెలియని పరిస్థితులండే. మొత్తం ప్రక్రియనంతా ఆన్‌లైన్ చేయడంతో విద్యార్థులకు సులభతరంగా మా రింది. ఈ - పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తుచేసి, కావాల్సిన డాక్యుమెంట్లను ఆప్‌లోడ్‌చేసి, దరఖాస్తును ప్రింట్ తీసి కాలేజీలో సమర్పిస్తే చాలు..నిక్షేపంగా ఉండొచ్చు. ఆయా ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రింటు తీసుకుని, కాలేజీ ప్రిన్సిపాళ్లకు సమర్పిస్తే, వాళ్లు అప్రూవ్‌చేసి, విద్యార్థుల బొటనవేలి ముద్రను తీసుకుని, ప్రిన్సిపాళ్లు వాటిని ఆయా సంక్షేమశాఖలకు పంపిస్తే, వాటిని సంక్షేమాధికారులు పరిశీలించి, బార్‌కోడ్ వేసి, బిల్లు జనరేట్ చేస్తేనే స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను మంజూరుచేస్తున్నారు. ఇంత సులభంగా విద్యార్థుల ఖాతా ల్లో డబ్బులు జమ అవుతున్నాయి.

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులంతా ఈ పది రోజుల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమాధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులకు ఇదే మంచి అవకాశమని, ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకోరాదని అధి కారులు కోరుతున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...