యువతతోనే అభివృద్ధి ఆవిష్కరణ


Sun,January 20, 2019 12:28 AM

నేటి తరం యువకులు.. నవ సమాజ నిర్మాతలు.. 135 దేశాలు.. 550 మంది ప్రతినిధులు.. ఒకే వేదికపై సందడి చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సు శనివారం హుషారుగా సాగింది. ‘గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు’ అంశంపై నిర్వహించిన సదస్సు యువ ప్రతినిధులను ఆకట్టుకున్నది. సామాజికవేత్త అన్నా హజారే, ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ సార్క్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్ బహదూర్ , నిజామాబాద్ ఎంపీ కవిత ప్రసంగాలు స్ఫూర్తినిచ్చాయి. ప్రతినిధుల కోసం చేసిన తెలంగాణ వంటకాలు నోరూరించాయి. సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్ చారిత్రక వైభవాన్ని చాటాయి.

యువతకు వేదిక
పలు దేశాల యువతను ఒక చోటికి తీసుకొచ్చిన తెలంగాణ జాగృతికి ధన్యవాదాలు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచేందుకు ఇంతమంది ఒక్క చోటికి చేరడం సంతోషదాయకం. హైదరాబాద్ విభిన్న సంస్కృతులు ఆకట్టుకుంటున్నాయి.
- యూసుఫ్, మొరాకో, ఆఫ్రికా

మొదటిసారిగా..
హైదరాబాద్ మొదటిసారిగా వచ్చా. రెండు వారాలుగా నగరంలోనే వ్యాపార అంశాలు నేర్చుకుంటున్నా. స్వీడన్ ఒకరికొకరు తెలిస్తేనే.. కలిసిమెలిసి ఉంటారు. కానీ ఇక్కడ ఏమాత్రం పరిచయం లేకున్నా.. ప్రజలంతా కలివిడిగా ఉంటున్నారు.
- లిన్నియా మాంటిజ్, స్వీడన్ బాగుంది..
హైదరాబాద్ వాతావరణం బాగుంది. ఇక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే హైదరాబాద్ ఇప్పటికే చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇలాంటి అవకాశం కల్పించినందుకు తెలంగాణ జాగృతికి ధన్యవాదాలు. హైదరాబాద్ విదేశీ కంపెనీల స్థాపనకు కేంద్ర బిందువు అవుతుంది.
- ఫక్రియా తవకోలొవ, కిజికిస్థాన్

అభివృద్ధిలో ముందంజ..
మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ ఉంటున్నా. గుజరాత్ పోల్చితే, హైదరాబాద్ అభివృద్ధి పరంగా ఎంతో ముందంజలో ఉన్నది. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో లీడర్ గురించి తెలుసుకునేందుకు వచ్చా. అందుకు తగిన విధంగా వక్తల ప్రసంగాలు ఉండటం మరింత ఉత్సాహానిచ్చింది.
- గుల్ గుజరాత్

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...