మరిన్ని బస్తీ దవాఖానలు


Sun,January 20, 2019 12:25 AM

-కొత్తగా 220 ఏర్పాటు
- విడుతల వారీగా ప్రారంభం
సిటీబ్యూరో: గ్రేటర్ 220బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ ఇచ్చింది. మహానగరం వ్యాప్తంగా బస్తీదవాఖానలకు సంబంధించి వైద్యులు, నర్సింగ్ తదితర సిబ్బంది నియామకానికి సంబంధించిన నియామక ప్రక్రియ బాధ్యతలను రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖాన చొప్పున విడుతల వారీగా 220 దవాఖానల ఏర్పాటుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి బస్తీ దవాఖానకు ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక సిబ్బంది చొప్పున నియామకాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఇప్పటికే వైద్యులకు సంబంధించిన నియామక ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 106, రంగారెడ్డి జిల్లా పరిధిలో 60, మేడ్చల్ జిల్లా పరిధిలో 54చొప్పున బస్తీదవాఖానలను ఏర్పాటు చేసేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు వివరించారు. మొదటి విడుతగా జనవరి 31లోపు, రెండో విడుతగా ఫిబ్రవరి, మూడో విడుతగా మార్చిలో మొత్తం 220 బస్తీదవాఖానలను ప్రారంభించనున్నట్లు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని అర్బన్ ఏరియాల్లో ఈ బస్తీదవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానలతో రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, వారితో పాటు వైద్యసిబ్బందికి కూడా మేలు కలుగుతుందన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...