ఏప్రిల్ వరకూ ఓటరు నమోదు..


Sun,January 20, 2019 12:24 AM

-రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించాలని ప్రతిపాదిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపినట్లు, వారు ఆమోదిస్తే గడువు పొడిగిస్తామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో శనివారం రజత్ జీహెచ్ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అదనపు ముఖ్య అన్నికల అధికారి బుద్ధప్రకాశ్, జీహెచ్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని ఎన్నికల అధికారులంతా పాల్గొన్నారు. దరఖాస్తుల గడువు జనవరి 25న ఒకవేళ ముగిసినప్పటికీ పేరు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ వరకు అవకాశం ఉంటుందని రజత్ స్పష్టం చేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...