యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం


Sun,January 20, 2019 12:22 AM

చాంద్రాయణగుట్ట: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. శనివారం ఫలక్ ఏసీపీ పరిధిలోని ఇంజన్ ద ప్రోగ్రెస్ హై స్కూల్ ఆవరణలో ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్, ఇన్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ కమిషనర్ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి వ్యక్తి కలలు కన్నాలని వాటిని సకారం చేసుకునేందుకు కష్టపడాలన్నారు. చదువుకున్న యువత అన్ని రంగాల్లో రాణించాలనేది తమ ధ్యేయమన్నారు. కాలానికి అనుగుణంగా మారుతేనే ఏకగ్రత్తతో ఏదైనా సాధించగలుగుతామన్నారు.జాబ్ 23 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగుతే తప్పనిసరిగా విజయం సాధిస్తామన్నారు. నగరంలో ఐదు జోన్ల పరిధిలో జాబ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కాగా, జాబ్ 3,800 మంది పాల్గొనగా, 834 మందికి ఉద్యోగాలు లభించాయి.దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా, ఫలక్ ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్, ఇన్ కె.శ్రీనివాస్ ఆర్.విద్యాసాగర్ ద ప్రోగ్రెస్ హై స్కూల్ చైర్మన్ మీర్జా మహ్మద్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...