‘నమామి సృజన రచనలు-సమగ్ర పరిశీలన’ ఆవిష్కరణ


Sat,January 19, 2019 01:03 AM

ఖైరతాబాద్: సాహిత్యానికి నిజమైన నిర్వచనమిచ్చిన రచయిత ననుమాస స్వామి అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నా రు. ప్రముఖ కవి, పరిశోధకుడు, రచయిత, ప్రొఫెసర్ ననుమాస స్వామి సృజన రచనలపై ప్రామాణిక పరిశోధన గ్రంథం ‘నమామి సృజన రచనలు-సమగ్ర పరిశీలన’ అనే అంశంపై అధ్యాపకులు డాక్టర్ పొలమూరి విక్రమ్ సిద్ధాంత గ్రంథం సమర్పించి పీహెచ్ పట్టా పొందిన సందర్భంగా సోమా జిగూడ ప్రెస్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పుస్తకాన్ని అల్లంనారాయణతో పాటు బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీ శంకర్, ప్రొఫెసర్ ననుమాసస్వామి, కోర్టు న్యాయవాది డాక్టర్ పీబీ విజయ్ కుమార్, పరిశోధకుడు డాక్టర్ విక్రమ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ సాహిత్య రంగంలో అన్ని రకాల రూపాలను ఆవిష్కృతం చేసిన ఘనత ననుమాస స్వామికే దక్కుతుం దన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అనేక కళాప్రదర్శనలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రత్యేక సంప్రదాయాల్లో స్వామి మినహాయింపు కాదన్నారు. సమాజం గుర్తించని మనుషులు సాహితీవేత్తలు, కళాకారులు, ఉద్యమాకారులయ్యారని, అలాంటి కోవకు చెందిన ననుమాస స్వామి వృత్తి పురాణాలను రాసిన ఏకైక కవి, అని కొనియాడారు. డాక్టర్ పాలమూరి విక్రమ్ మాట్లాడుతూ ననుమాస స్వామి ప్రాథమిక విద్య, 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లడం, ఆయన సృజన రచనలు, వృత్తి పురాణాలు, పత్రికా నిర్వహణ తదితర అంశాలపై తన పరిశోధన సాగిందన్నారు. ఆయన 67వ జన్మదినం సందర్భంగా ఈ పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కృతం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయశ్రీ, ఉదయశ్రీ ప్రచురణల అధినేత ననుమాస సుభాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...