వైభవంగా ముగిసిన తెలుగు నాట్యోత్సవాలు


Sat,January 19, 2019 01:01 AM

తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, యక్షగాన కేంద్రం కూచిపూడి సంయుక్తాధ్వర్యంలో నాంపల్లిలో గల తెలుగువర్సిటీ ఆడి టోరియంలో మూడు రోజులుగా నిర్వహించిన తెలుగు నాట్యోత్సవాలు ఘనంగా ముగిశాయి. తెలుగు నాట్యాల పరిశోధన క్రమం సమాలోచన అనే అంశంపై ఆచార్య ఎం.ఎస్ శివరాజు అధ్యక్షతన కళాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించగా వక్తలు రత్నశ్రీ, డాక్టర్ సువర్చలాదేవి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రేణుక, డాక్టర్ లింగయ్య పాల్గొని నాట్యం, సంగీతం పరిణామ క్రమంపై ప్రసంగం చేశారు. పేరిణి కుమార్ ఈ సందర్బంగా పేరిణినాట్యరీతులను సోదాహరణంగా వివరిస్తూ పత్ర సమర్పణ చేశారు. కుమారి సాత్వికతో కలిసి డాక్టర్ సువర్చలాదేవి అభినయ పూర్వకప్రసంగం చేసి ఆహుతులకు పంచారు. సాయంత్రం జరిగిన నాట్యో త్సవాలలో శ్రీహరి రామమూర్తి తన శిష్య బృందంచే బృంద నాట్యం(కూచిపూడి), ఆచార్య జొన్నలగడ్డఅనురాధ శిష్య బృందంచే నమోస్తునారి (కూచిపూడి) ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం తెలుగువర్సిటీ రిజిస్ట్రార్, ప్రఖ్యాత నృత్య గురువు ఆచార్య అలేఖ్య పుంజాల, గురువు కళాకృష్ణ, డాక్టర్ తాడేపల్లి సత్య నారాయణ శర్మ కలిసి ప్రదర్శించిన కూచిపూడి భామా కలాపం ఈ నాట్యోత్సవానికే ప్రత్యేకతను చాటుతూ రసజ్ఞులైన నాట్యప్రియుల ప్రశంసలందుకున్నారు. తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, రిజిస్ట్రార్ అలేఖ్య ఈ ఉత్సవాలలో పాల్గొన్న గురువులను, కళాకారులను సత్కరించారు

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...