దివ్యాంగుల చేయూతకే ‘సుధా’ నాట్య కచేరీ


Sat,January 19, 2019 01:01 AM

-బీఎంవీఎస్ సంస్థ పోషకుడు పీసీ పారఖ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకే ప్రముఖ సినీ, టీవీనటి, నర్తకి సుధా చంద్రన్ లైవ్ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి, బీఎంవీఎస్ సంస్థ పోషకుడు పీసీ పారఖ్ అన్నారు. భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి(బీఎంవీఎస్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లోని పలువురు దివ్యాంగులకు ఉచితంగా(జైపూర్ ఆర్టిఫిషియల్ లింబ్స్) కృత్రిమ అవయవాలను ‘జైపూర్ ఫుట్’ పేరిట అందిస్తున్నారన్నారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ రాజస్థాన్ జైపూర్ ఏర్పడిందని, రాజకీయాలకు, మత ఆర్గనైజేషన్ సంబంధించినది కాదన్నారు. కుల, మత, ప్రాంత ప్రాతిపదికన కాకుండా బీఎంవీఎస్ సంస్థ దివ్యాంగులకు చైతన్యం, గౌరవాన్ని అందిస్తుందన్నారు. కాళ్లు, చేతులు లేని స్థానికులకు ఆర్టిఫిషియల్ అవయవాలు అందించేందుకు కింగ్ కోఠిలోని ప్రభుత్వ దవాఖానలో ‘జైపూర్ ఫుట్’ ప్రత్యేక విభాగం ఉందన్నారు. ఎవరికైనా ఉచిత సేవలందిస్తున్నామని, అవసరమైన వారు ఫోన్ : 040-29800551, 49457755లో సంప్రదించాలన్నారు. ప్రెసిడెంట్ లక్ష్మీ నివాస్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ ఫరీదా హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ ఉషా ఫారూఖ్, సెక్రటరీ ఇందర్ చాంద్ జైన్, సంజయ్ దుగర్, వికలాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్ అశోక్ పాల్గొన్నారు. శనివారం శిల్పకళావేదికలో జరిగే లైవ్ నర్తకి సుధా చంద్రన్ దివ్యాంగుల బృందం పాల్గొని నర్తించనున్నది.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...