రేపటి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షోలు


Wed,November 21, 2018 12:59 AM

-రోజుకు రెండు సెగ్మెంట్లు..14 నియోజకవర్గాల్లో ప్రచారం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 14 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నాలుగున్నరేండ్లలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి, రాబోయే మూడేండ్లలో రూ. 50 వేల కోట్లతో చేపట్టే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నంలో, వచ్చే నెల 3న పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

ఉప్పల్ నియోజకవర్గపరిధిలో ఈనెల 22న మంత్రి కేటీఆర్ రోడ్‌షో ఉన్న నేపథ్యంలో మంగళవారం ఏర్పాట్లను టీఆర్‌ఎస్ ఉప్పల్ అసెంబ్లీ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌రెడ్డి,బండారి లకా్ష్మరెడ్డి పరిశీలించారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతం, మల్లాపూర్ శివ హోటల్ ప్రాంతం, ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాలను ఎంపిక చేశారు. రోడ్‌షోను విజయవంతం చేయాలని వారు కోరారు. వారి వెంట మేకల హన్మంతరెడ్డి, గోపు సదానంద్, సాయిజెన్ శేఖర్, మహేశ్, ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...