25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ


Wed,November 21, 2018 12:45 AM

ఖైరతాబాద్ : ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా బూత్ లెవల్ అధికారులు పాటుపడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని మోడ్రన్ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన విచ్చేసి ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఓటింగ్ శాతాన్ని పెంచడం, మరణించిన, ఇండ్లు మారిన ఓటర్లను గుర్తించాలని, దివ్యాంగులు ఓటు వేసే చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాలని, సరిగా పంపిణీ చేయకుంటే ఓటింగ్ తక్కువగా నమోదయ్యే ప్రమాదమున్నదని సూచించారు. 25 నుంచి జరిగే ఓటరు స్లిప్‌ల పంపిణీలో బూత్ స్థాయి ఏజెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను వెంట తీసుకెళ్లాలని సూచించారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా బీఎల్‌వోలు చొరువ తీసుకోవాలన్నారు. బీఎల్‌వోలు సరిగ్గా ఫీల్డ్‌లోకి రావడం లేదని ఏజెంట్లు, పలు పార్టీల నాయకుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని, అలాంటివి రాకుండా చూసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో 200 కేంద్రాల్లో 40 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిందని, ఈసారి అలా జరుగకుండాఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి మాట్లాడుతూ 25 నుంచి 1వ తేదీ వరకు ఓటరు లిస్టు, ఎపిక్ కార్డు, ఓటరు స్లిప్‌లతో బీఎల్‌వోలు ఫీల్డ్‌లో వెళ్లాలని, ఈఆర్‌వో, ఆర్‌వోల ఆదేశాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు వారితో కమ్యూనికేట్ చేసుకోవాలన్నారు. అనంతరం ఓటరు అవగాహన స్టిక్కర్లను విడుదల చేశారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...