క్యాంపస్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి


Wed,November 21, 2018 12:44 AM

హైదరాబాద్, నమస్తేతెలంగాణ : ర్యాగింగ్, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై దాడుల నిరోధంపై మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, శంషాబాద్ డీసీపీ రవిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై దాడుల వంటి అంశాలపై షీటీం బృందం కళారూపాలను ప్రదర్శించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు మాట్లాడుతూ... క్యాంపస్‌లోనూ విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపవద్దని హితవు పలికారు. ఈతరం యువత సెల్ ఫోనులలో ఎక్కువ సమయం కేటాయించడం మంచి పరిణామం కాదన్నారు. తల్లిదండ్రులను, టీచర్లను, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. సంస్కారం ఇంటినుంచే మొదలు కావాలన్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ...ట్రాఫిక్ నిబంధనలు , ర్యాగింగ్‌కు పాల్పడితే ఉండే శిక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రంలో రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్, డీఎస్‌ఏ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, అసోసియేట్ డీన్ డాక్టర్ జె.సత్యనారాయణ, డీన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డాక్టర్ సదాశివరావు, ఓఎస్‌ఏ డాక్టర్ పి.రమేష్‌బాబు, పలువురు పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...