మిలాద్ ఉన్ నబీకి భారీ బందోబస్తు


Tue,November 20, 2018 12:57 AM

చార్మినార్ : పాతనగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మిలాద్ ఉన్ నబీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో పాతనగరానికి చెందిన మతపెద్దలతో సీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతనగరం శాంతికి నిలయమని, ఇక్కడి ప్రజలు ఏ వర్గానికి చెందిన ఉత్సవాలైనా ఇరువర్గాలు పాలుపంచుకుంటూ శాంతియుతంగా నిర్వహించుకుంటారని గుర్తుచేశారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి 2 వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వివరించారు. ర్యాలీ సాగే దారిపొడవునా సీసీ కెమెరాలతోపాటు ఇతర సాధనాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో దక్షిణ మండల డీసీపీ అంబర్ కిశోర్ ఝా, అదనపు డీసీపీ రఫీక్, పలువురు ఏసీపీలు పాల్గొన్నారు.

రేపు పాతబస్తీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మిలాద్ ఉల్ నబీ సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పాతబస్తీతోపాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. చాదర్‌ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఉంటుందని, ఎస్‌జే రోటరీ, మీరాలం మండి రోడ్డు ర్యాలీ ముగిసే వరకు బస్సులకు అనుమతి ఉండదని వెల్లడించారు. ర్యాలీలో పాల్గొనేవారు తమ వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్‌లో పార్కు చేయాలని సూచించారు. చార్మినార్, మొఘల్‌పురా, గుల్జార్‌హౌస్, ఝాన్సీబజార్, సిటీ కాలేజీ, మదీనా, ఢిల్లీగేట్, దారుల్‌షిఫా, చట్టబజార్, ఏపీఏటీ, పురానాహేవేళి, ఎతెబార్‌చౌక్, కోట్ల అలీజ పరిసర ప్రాంతాల మీదుగా ర్యాలీ సాగనుంది. ఇదిలాఉండగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు యాకుత్‌పురా రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...