ఉస్మానియాలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ నూతన వార్డు ప్రారంభం


Tue,November 20, 2018 12:57 AM

బేగంబజార్ : ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖానలో సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నూతన వార్డు ప్రారంభమైంది. 40 పడకలతో నిర్మించిన ఈ వార్డును దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియాకు నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యమం దించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో గతంలో 50 పడకలు ఉండేవని, శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని తొలగించి నూతన వార్డు నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో-1 డాక్టర్ శ్రీనివాస్‌బాబు, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొ.రమేశ్‌కుమార్, డాక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్లూమ్ పరిశ్రమలను తీర్చిదిద్దాలి
మాస్ట్రిచ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీబె బిజ్‌కర్
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : హ్యాండ్లూమ్ పరిశ్రమలకు సృజనశక్తి జోడించి తీర్చిదిద్దాలని మాస్ట్రిచ్ విశ్వవిద్యాలయం (నెదర్లాండ్స్) ప్రొఫెసర్ వీబె బిజ్‌కర్ అన్నారు. అంతరించిపోతున్న హ్యాండ్లూమ్స్, చేతివృత్తులపై ఇటీవల ప్రకాశం జిల్లా చీరాలలో ఈ నెల 11 నుంచి 17 వరకు అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సు జరిగిన తీరుతెన్ను, వృత్తులు, వివరాలపై సోమవారం బంజారాహిల్స్‌లోని సప్తపర్ణి వేదికలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రీడ్స్ (రూరల్ ఎకోనమిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రీడ్స్ చైర్మన్ రవీంద్ర విక్రం అధ్యక్షత వహించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలు, దేశ, విదేశాల నుంచి 300 మంది కళాకారులు, బోధనా సిబ్బంది, డిజైనర్లు, నిష్ణాతులు అంతా ఒక వేదికపైకి వచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్రొ.వీబె బిజ్‌కర్ మాట్లాడుతూ నానాటికి ఉనికి కోల్పోతున్న హ్యాండ్లూమ్స్, చేతివృత్తుల పరిశ్రమలను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో చేతివృత్తులు అంతమైపోయాయని, అలాంటి పరిస్థితులు ఇండియాకు రావొద్దన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అహ్మదాబాద్ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్‌చటర్జీ మాట్లాడుతూ మనదేశంలో చేతివృత్తులు, కళాకారులకు గుర్తింపు లేదన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రతినిధి మోహన్‌రావు మాట్లాడుతూ చేతివృత్తుల రంగం దాదాపు 43 లక్షల మందికి ఉపాధి ఇస్తుందన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...