కాంగ్రెస్ బుజ్జగింపులు ఫలించేనా?


Tue,November 20, 2018 12:56 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దాదాపు నెలరోజులపాటు తీవ్ర కసరత్తు నిర్వహించి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరా రు చేసినప్పటికీ అధికారిక అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో కార్య కర్తలనుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు కొన్నిచోట్ల తిరుగుబాటుచేస్తూ స్వతంత్ర అభ్య ర్థులుగా బరిలోకి దిగగా, మరికొన్నిచోట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గాల వారీగా అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అయితే వారి బుజ్జగింపులకు నేతలు మెత్తబడకపోవ డం పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్‌లోని 24 నియాజకవర్గాలకుగాను కాంగ్రెస్ పార్టీనుంచి 16మంది బరిలోకి దిగగా, ఆరు స్థానాలు టీడీపీకి, రెండు జనసమితికి కేటాయిం చా రు. ఇందులో ముఖ్యంగా మజ్లీస్ ఆధీనంలోని ఏడు స్థానాల కుగాను ఆరు స్థానాలు మినహా మిగిలిన అన్నిచోట్లా టికెట్లు ఆశించి భంగపడిన నేతలనుంచి అధికారిక అభ్యర్థులనుంచి సహా య నిరాకరణ ఎదురవుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, యాకత్‌పురా, కంటోన్మెంట్, ఖైరతాబాద్, ఉప్పల్ తదితర స్థానాల్లో స్వతంత్ర అభ్య ర్థులుగా బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజేంద్రనగర్ స్థానంనుంచి కార్తీక్‌రెడ్డి, శేరిలిం గంపల్లినుంచి భిక్షపతియాదవ్, సికింద్రాబాద్ స్థానంనుంచి బండ కార్తీకరెడ్డి, ఖైరతా బాద్‌బాద్ నుంచి రోహిన్‌రెడ్డి, కంటోన్మెంట్ నుంచి గణేష్, యాకత్‌పురనుంచి ఆబిద్ రసూల్ ఖాన్ తదితరులు నామినేషన్లు దాఖలుచేశారు. గత కొంతకాలంగా వీరు క్షేత్రస్థాయిలో పోటీచేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకోగా, ఇప్పుడు సీట్ల వ్యవహారం తేలిపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

టీడీపీ, జనసమితికి కేటాయించిన సీట్లలో సైతం కాంగ్రెస్ భంగపడ్డ నేతలనుంచి వ్యతిరేకత వ్యక్తమవు తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల విషయానికొస్తే, ఇన్నిరోజులూ టికెట్ల సాధనకోసం ఢిల్లీస్థాయిలో పైరవీలుచేసి ఎట్టకేలకు సఫల మైతే, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు వారికి తల నొప్పిగా మారాయి. ప్రముఖ నేతలను స్వయంగా ఢిల్లీ స్థాయి నేతలే బిజ్జగించినప్పటికీ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. భంగ పాటుకు గురైన నేతల అనుచరగణం ప్రచారానికి రాకుండా ముఖం చాటేస్తోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఎదురీదక తప్పని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో కాంగ్రెస్ పార్టీకిచెందిన చోటామోటా నేతలుసైతం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలుచేశారు. అయితే వీరు బరిలో ఉంటారా, లేదా, బుజ్జగింపులు ఏ మేరకు ఫలితాలిస్తాయనే మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే వీలుంది. ఈనెల 22వ తేదీ నామినేషన్ల ఉపసం హరణకు చివరితేదీ కావడంతో అదేరోజు తిరుగుబాటు అభ్యర్థులు పోటీనుంచి తప్పుకునే అవకాశముంది. ఒకవేళ అధిష్టానం బుజ్జగింపులు ఫలిస్తే అధికారిక అభ్యర్థులకు క్షేత్ర స్థాయిలో లైన్‌క్లియర్ అవుతుంది. లేనిపక్షంలో ఓట్ల చీలిక తప్పదని చెప్పవచ్చు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...