ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నాం


Tue,November 20, 2018 12:56 AM

మేడ్చల్ కలెక్టరేట్ : జిల్లాలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కలెక్టర్ ఎంవీరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల పరిశీలకులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా భౌగోళిక స్వరూపం, నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న జాగ్రత్తలు, పోలింగ్ స్టేషన్‌ల వివరాలు, అదే విధంగా జిల్లాలో చేపడుతున్న స్వీప్ అక్టివిటీ తదితర అంశాలపై ఎన్నికల పరిశీలకులకు వివరించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి సర్వేలెన్స్, ైఫ్లెయింగ్ స్కాడ్ , అకౌంటింగ్, వీడియో వ్యూయింగ్ టీంలను ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న రూ.99 లక్షలు, 19.123 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లుగా తెలిపారు. ఎన్నికల్లో జరిగే ఉల్లంఘనలపై పౌర సమాజాన్ని సమాయత్తం చేసేందుకు సీ-విజిల్, సువిధ, సమాధాన్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలోని దివ్యాంగులు, మహిళలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

జిల్లాలో ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ మిషిన్స్, వీవీ ప్యాట్‌లను ర్యాండమైజేషన్ చేసి నియోజకవర్గాలకు పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు కుమార్, అరుణ్‌ప్రకాశ్, అలోక్ ఆవస్థి, బాబులాల్ మీనాలు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీపీలు పద్మజ, ఉమామహేశ్వర శర్మ, డీఆర్వో మధుకర్‌రెడ్డి, డీఆర్డీఓ కౌటిల్య, అధికారులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...