ముగిసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన


Sun,November 18, 2018 12:23 AM

జీడిమెట్ల : గత రెండ్రోజులుగా కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన మేడ్చల్ జిల్లాస్థాయి 46వ జవహర్‌లాల్ నెహ్రూ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన ముగిసింది. శనివారం రాత్రి గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధి ఆదర్శనగర్‌లోని నవజ్యోతి హైస్కూల్‌లో జరిగిన ముగింపు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా సైన్స్ అధికారి రవీందర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిలోని వనరులను కలుషితం కాకుండా రేపటి తరాలకు అందించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. నిత్య జీవితంలో సవాళ్లు-జ్ఞానిక పరిష్కారాలు అనే ప్రధాన అంశంతో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో 325 ఎగ్జిబిట్లు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిట్లలో పి.వర్షిత్‌రెడ్డి-తేజస్వి విద్యారణ్య హైస్కూల్, పూజ-జిల్లా పరిషత్ హైస్కూల్ పూడూరు, బి.కిరణ్-త్రివేణి ఇంప్యాక్ట్ స్కూల్, యానామ్ మనీశ్-వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్, తన్వీన్‌బేగం-శెరినిటి హైస్కూల్, చందన ప్రియ-బ్రైట్ కాన్సెప్ట్ హైస్కూల్, అజిత్‌కుమార్-లిటిల్ స్టార్స్ హైస్కూల్, మెహరాజ్ బేగం-నాగార్జున హైస్కూల్, రాజశ్రీ-నవజ్యోతి హైస్కూల్, ఎం.సుష్మ-అరుంధతి విద్యాలయ, మణికంఠ-శ్రీసాయి విద్యానికేతన్, లలిత జ్యోతి-త్రివేణి హైస్కూల్, బీషాసింగ్-సెయింట్ క్లారెట్ హైస్కూల్, టీచర్ ఎగ్జిబిట్ కవిత-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు మేడ్చల్‌లు ఎంపికయ్యారు. హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి ప్రభాకర్, ఎంఈవోలు శశిధర్, ఆంజనేయులు, మదనాచారీ, శివరాత్రి యాదగిరి, నవజ్యోతి హైస్కూల్ డైరెక్టర్ రవీంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ ఇందిరా, మల్కాజిగిరి ఎంఈవో ఆర్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...