అక్రమ మద్యం రవాణా నిరోధానికి నిఘా


Sun,November 18, 2018 12:21 AM

-సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యం సరఫరా, రవాణా జరుగకుండా ఉండేందుకు ఆబ్కారీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్‌లోకి మద్యం, మత్తు పదార్థాలు, కల్లు అక్రమ రవాణా జరుగకుండా ఉండేందుకు గ్రేటర్‌లోని అన్ని జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా గ్రేటర్ ఆబ్కారీ అధికారులు పొరుగు జిల్లాలకు చెందిన అబ్కారీ అధికారులతో కలిసి సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్‌లోకి మద్యం, మత్తు పదార్థాలు వంటివి అక్రమంగా రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. అందుకోసం ఆబ్కారీ అధికారులతో అంతర్ జిల్లా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం, డ్రగ్ మాఫియాలు, పాతనేరస్తులు, అక్రమ రవాణాదారుల కదలికలపై గట్టి నిఘా పెట్టినట్లు అధికారు వివరించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...