108లో ఉద్యోగాలకు 19నుంచి ఇంటర్వ్యూలు


Sun,November 18, 2018 12:20 AM

సిటీబ్యూరో/బేగంబజార్, నమస్తే తెలంగాణ : జీవీకే-ఈఎంఆర్‌ఐ బైక్ అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, డ్రైవర్ల నియామకానికి ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ సుహాస్ చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోసం బీఎస్సీ, లైఫ్ సైన్సెస్/బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగి ఉండి, ద్విచక్ర వాహన లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉన్న పురుష అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. డ్రైవర్ ఉద్యోగాలకు టెన్త్ ఉత్తీర్ణులై, ఎల్‌ఎంవీ, హెచ్‌ఎంవీ ట్రాన్స్‌పోర్ట్ బ్యాడ్జీ లైసెన్స్‌గల వారు అర్హులని, అంధత్వం ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు రోజుకు 12గంటల పాటు పనిచేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల వయస్సు 40 ఏండ్లకు మించరాదని, తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి 5.4 ఫీట్ల ఎత్తు, మంచి శారీరదారుఢ్యం గల వారు హాజరుకావచ్చన్నారు. ఇంటర్వ్యూలను కింగ్‌కోఠి జిల్లా దవాఖాన ప్రాంగణంలోని జీవీకే ఈఎంఆర్‌ఐ 108 ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహిస్తామని, ఇతర వివరాలకు 9100799259, 7702122533నంబర్లలో సంప్రదించాలన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...