పెరగనున్న ఆహార భద్రత కార్డులు


Sun,November 18, 2018 12:18 AM

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : నగరంలో ఆహారభద్రత కార్డుల సంఖ్య భారీగా పెరుగనుంది. నగరంలోని 9 సర్కిళ్లలో సుమారు 18 నుంచి 19 వేల వరకు రేషన్‌కార్డులు పెరుగుతున్నట్లు నగర పౌరసరఫరాలశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ పరిధిలోని 9 సర్కిళ్లలో కలిపి 42,256 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమివ్వడంతో హైదరాబాద్ సీఆర్వో పరిధిలో చాలా కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులను గుర్తించారు. ఆలస్యమైనప్పటికీ అనర్హులకు సబ్సిడీ సరుకులు అందవద్దనే ఉద్దేశంతో అత్యంత జాగ్రత్తగా వడపోత పోశారు. దీంతో సగానికి పైగా అనర్హులు తేలినట్లు చెప్పారు. అందులో పెద్దపెద్ద భవంతులు, నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు కిరాయిలు వస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నట్లు తేలడంతో అనర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం నగరంలో 5,56,854 ఆహారభద్రత కార్డులు ఉండగా కొత్త కార్డుల జారీతో మరిన్ని పెరుగనున్నాయి. డీలర్ల సమ్మె నేపథ్యంలో రేషన్ పంపిణీకీ ఎలాంటి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో చేసే ఏర్పాట్లు చేయడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు వీటిని వేగవంతం చేసి త్వరలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 9 సర్కిళ్లలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే చార్మినార్ సర్కిల్ నుంచి అత్యధికంగా దరఖాస్తులు రాగా, మెహిదీపట్నం, యాకుత్‌పురా సర్కిళ్లు రెండు, మూడో స్థానంలో ఉన్నాయి.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...