పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేయండి


Sun,November 18, 2018 12:17 AM

-వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ కలెక్టర్ ఆదేశం
మేడ్చల్ కలెక్టరేట్ : వచ్చేనెల 7న జరిగే ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను ఇప్పటికే మొదటిసారి ర్యాండమైజేషన్ చేయడం జరిగిందని, వాటిని జిల్లాలోని 5 నియోజకవర్గాలకు త్వరలో తరలిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్‌రూంలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల శిక్షణకు వచ్చిన సిబ్బంది నుంచి ఫామ్-12 (పోస్టల్ బ్యాలెట్) స్వీకరించాలని,లేనిపక్షంలో ఆర్వోలు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారుల నుంచి తెప్పించుకోవాలని సూచించారు. ఈనెల 24న పోటీ చేయబోయే అభ్యర్థుల ఎదుట ఈవీఎంలు, వీవీ ప్యాట్ మిషన్‌లను రెండోసారి ర్యాండమైజేషన్ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో మధుకర్‌రెడ్డి, నోడల్ అధికారులు, ఆర్వోలు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...