దూసుకుపోతున్నారు..


Sat,November 17, 2018 01:12 AM

-నామినేషన్లు వేసి.. మరింత జోరుగా ప్రచారం
-భారీ మెజారిటీయే లక్ష్యం
-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు
టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నెలన్నరగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమైన అభ్యర్థులు.. ఇప్పుడు మరింత జోరు పెంచారు. భారీ మెజారిటీయే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. మరో వైపు కూటమిలో ఇంకా సీట్ల కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నా యి. అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లోనూ ఆశావహులు తిరుగుబావుటా ఎగురేస్తున్నారు. నిరసనలతో అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. టికెట్ రాకుంటే రెబల్స్‌గా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

-నమస్తే నెట్‌వర్క్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను శుక్రవారం మరో 31 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు 36 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) ఎం. దానకిశోర్ తెలిపారు. ఇప్పటి వరకు దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 126కి చేరిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్, అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్‌రెడ్డి, చాంద్రాయణగుట్ట స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎం. సీతారాంరెడ్డి, బీజేపీ నుంచి అదే స్థానానికి సహజాది సయ్యద్, సనత్‌నగర్ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్, కార్వాన్ బీజేపీ అభ్యర్థిగా అమర్‌సింగ్, బహదూర్‌పుర స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మీర్ ఇనాయత్ అలీ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.

మేడ్చల్ జిల్లాలో 19..
-ఇప్పటి వరకు 50 నామినేషన్లు
మేడ్చల్ కలెక్టరేట్ : మేడ్చల్ జిల్లా పరిధిలో శుక్రవారం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి లొగ్గారి రమేశ్ (బహుజన రాష్ట్ర సమితి), నందికంటి శ్రీధర్ (కాంగ్రెస్), పండిత్ రాహుల్ (స్వర్ణ భారత్ పార్టీ), ఎన్. రాంచందర్ రావు (బీజేపీ), కుత్బుల్లాపూర్ నుంచి ముదిమెల రాము (స్వతంత్ర), కండియాల వసంత రాఘవ (స్వతంత్ర), కూన శ్రీశైలంగౌడ్ (కాంగ్రెస్), వెలపూడి కిరణ్ కుమార్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), కూకట్‌పల్లి నుంచి దాసరి దేవన్న గౌడ్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), మురళీకృష్ణ (అనారక్షిత్ సమాజ్ పార్టీ), ఉప్పల్ నుంచి తంగునూరి బాల్‌రాజ్ ( న్యూ ఇండియా పార్టీ), కంపల్లి విజయకుమార్ (స్వతంత్ర) , బడ్డిటి రాజు (స్వతంత్ర), సి జగదీశ్ (శివ సేన) మేడ్చల్ నియోజకవర్గం నుంచి బి. జేసుదాసు చక్రవర్తి (నవ ప్రజారాజ్యం పార్టీ ), తోటకూర అశోక్ (టీడీపీ), పెద్ది మోహన్‌రెడ్డి (బీజేపీ) నుంచి నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా 12వ తేదీన నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటి నుంచి 16వ తేదీ వరకు 50 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

11న ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు
-టీఆర్‌ఎస్ ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్
బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ఉద్యమ సారథిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చూస్తుంటే రాష్ట్రంలో డిసెంబర్ 11న ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని నందినగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడు తూ.. ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి అవసరమైన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, టీఆర్‌ఎస్ నాయకులు బాబా నాయక్, రాములుచౌహాన్, వెంకటస్వామి, రాందాస్ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ కృషితోనే ఆదర్శ తెలంగాణ
-మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ కృషితోనే దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సనత్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం సనత్‌నగర్ డివిజన్‌లోని ఎస్‌ఆర్‌టీ క్వార్టర్స్, శివాజీనగర్ ప్రాం తాల్లో కార్పొరేటర్ కోలన్ లక్ష్మీరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. తలసాని చేపట్టిన ప్రచార పాదయాత్రకు అడుగడుగునా స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఘనత వహించిందన్నారు. సంక్షేమ పథకాలు పేదలను అన్ని విధాలా ఆదుకున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కోల న్ బాల్‌రెడ్డి,సురేశ్‌గౌడ్, దాడి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు
- మంత్రి, సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు
సికింద్రాబాద్, నమస్తేతెలంగాణ : కూటమి అభ్యర్థులకు ప్రజలే బుద్ధి చెబుతారని టీఆర్‌ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థి, మంత్రి టి. పద్మారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తార్నాక డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరారు. సీమాంధ్ర పాలకుల మోసపూరిత మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు. రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు గుర్తిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...