షోరూంలోనే రిజిస్ట్రేషన్


Sat,November 17, 2018 01:09 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సామాన్య ప్రజలు కొత్తగా వాహనం కొనుగోలు చేసి(కారు, బైక్) రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగకుండా కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవో నంబరు 83ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. అయితే వ్యక్తిగత వాహనాలైన కార్లు, బైక్‌లకు మాత్రమే విక్రయించే దుకాణాల (షోరూంల) వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నప్పటికీ దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించిన తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశముంది. మార్గదర్శకాల రూపకల్పనలో ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాలతో ఒక కమిటీ వేసి వీటికి తుదిరూపం ఇస్తారని రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. జారీచేసిన జీవో ప్రకారం కేవలం నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలు మాత్రమే షోరూంల వద్ద రిజిస్ట్రేషన్‌కు అనుమతించగా ట్రాన్స్‌పోర్టు వాహనాలు రిజిస్ట్రేషన్ కోసం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాలకు రావాల్సిందే.

సెకండ్ వెహికల్ ట్యాక్స్ విషయంలో డీలర్లపాత్రతో గతంలో ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్‌కు ఇబ్బంది ఏర్పడింది. అంతేగాకుండా డిస్కౌంట్ల పేరుతో వినియోగదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్లు వాళ్ల చేతికి వెళితే జవాబుదారితనం ఉంటుందా? లేదా? అనే అంశంపై రవాణాశాఖ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శకాల్లో పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు ద్వారా డీలర్లను సరైన మార్గంలో నడిపించవచ్చని తెలిపారు. డీలర్లు తప్పు చేస్తే భారీ జరిమానాతోపాటు, డీలర్షిప్‌ను కొన్ని నెలలపాటు సస్పెన్షన్ చేసే అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకున్నా రవాణాశాఖ కార్యాలయాలకు రావాల్సిందేనని తెలిపారు.

ఆర్‌టీఏ కార్యాలయానికి రావాల్సినవి
ట్రాన్స్‌పోర్టు వాహనాలైన బస్సులు, లారీలు, 10 సీట్లు దాటిన మినీ బస్సులు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహలైన రోడ్డు రోలర్స్, రిగ్‌మౌంటెడ్ వెహికిల్స్, నిర్మాణ సంబంధమైన వాహనాలు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...