ఎస్‌ఎంఎస్ చేయండి.. నిమిషంలో స్పందిస్తాం


Fri,November 16, 2018 12:34 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం..ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవంతమైంది. పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులకు, ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం ఏర్పడడంతో కలవరం లేకుండా వారు తమ ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్నారు. మరోవైపు పోలీసు వాట్సాప్ నెంబర్లు, సోషల్ మీడియా వేదికల మీదుగా నమోదవుతున్న ఫిర్యాదులపై కూడా పోలీసు చర్యలు అత్యంత వేగంగా ఉంటుండడంతో ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పెరిగింది. సాధారణ కేసులతో సాంకేతికతతో ఇమిడి ఉన్న కేసులను ఛేదనలో పోలీసు ఐటీ సెల్ బృందాల సేవలు కీలకంగా మారాయి. ఫిర్యాదులు స్వీకరించడమే కాదు వాటి పై పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలను నిరంతరం ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని పెంచుతున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వ్యవహారాల్లో మినిట్ టూ మినిట్ పర్యవేక్షణతో వారిని ఆపద నుంచి కాపాడుతున్నారు. ఈ విధంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు వాట్సాప్, ఫేసుబుక్, ట్విటర్‌ల ద్వారా వచ్చిన 3242 ఫిర్యాదులను పూర్తిగా పరిష్కరించి ఫిర్యాదుదారులకు అండగా నిలబడ్డారు. వారు ఇస్తున్న రిైప్లె మెసేజ్‌లు పోలీసులకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై ప్రతి పోలీసు సేవకు పూర్తి సాక్ష్యాధారాలు ఉంటుండడంతో సమస్య పరిష్కారం, పోలీసు చర్యలపై పారదర్శకత ఏర్పడింది.

ఒక్క నిమిషంలోనే స్పందిస్తారు : రాచకొండ పోలీసు వాట్సాప్, ఫేసుబుక్, ట్విటర్‌ను ఐటీ సెల్ విభాగం ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి సారథ్యంలోని ఆరుగురు సభ్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు రాగానే వెంటనే వాటి తీవ్రత, పరిధిని పరిశీలించి ఆయా పోలీసుస్టేషన్‌కు సమాచారం పంపిస్తారు. ఇదంతా ఓ నిమిషంలో జరిగిపోతుంది. సమాచారంలో లోపాలు ఉంటే వెంటనే బాధితులకు ఫోన్ చేసి స్పష్టత కోసం మరింత సమాచారం అడుగుతారు. ఆ తర్వాత దానిని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు బదిలీచేసి అప్రమత్తం చేస్తారు. ఇదే విషయాన్ని బాధితులకు సమాచారమిచ్చి వారిని సంప్రదించాలని సూచిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, భూకబ్జాలు, ఇతర నేరపూరితమైన అంశాలకు సంబంధించిన వ్యవహారాల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం నేపథ్యంలో ఆ ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు, అధికారుల ఏం చర్యలు తీసుకున్నారనే విషయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టును ఐటీ సెల్ అధికారులు రూపొందిస్తారు. ఈ నివేదికను సీపీకి అందిస్తారు. అదేవిధంగా ఐటీ సెల్ విభాగం నుంచి వెళ్లిన ఫిర్యాదులపై పోలీసు కమిషనర్ కూడా నిరంతరం వాకబు చేస్తుండడంతో పోలీసు అధికారుల తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా బాధితులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. ప్రధానంగా మహిళలు తాము ఆపదలో ఉన్నామని చేసే ఫిర్యాదులపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఐటీ సెల్ నిరంతరం కృషి చేస్తుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు రాగానే సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులు, షీ టీమ్స్, గల్లీ గస్తీ, మొబైల్ పెట్రోలింగ్ ఇతర విభాగాలను అప్రమత్తం చేసి నిమిషాల వ్యవధిలో పోలీసులు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.

పెండింగ్ జీరో...అన్ని పరిష్కారం
ఈ ఏడాది జనవరి నుంచి రాచకొండ పోలీసు వాట్సాప్ నెం.949061 7111,ట్విట్టర్, ఫేస్‌బుక్, హాక్-ఐ, ఎస్‌ఎమ్‌ఎస్, జీమెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్‌లకు వచ్చిన ప్రతి ఫిర్యాదును రాచకొండ పోలీసులు పరిష్కరించి బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. ఏ ఒక్క ఫిర్యాదు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫలితాలను ప్రజలకు అందించారు. పోలీసు సేవలను అందుకొని తమ సమస్యలను పరిష్కరించుకున్న బాధితులు మెసేజ్‌ల రూపంలో అందించిన ప్రశంసల వర్షం నిదర్శనం.
మాకు సెలవులు ఉండవు : శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, రాచకొండ ఐటీ సెల్ విభాగం ఐటీ సెల్ బృందానికి ప్రత్యేకంగా సెలవులంటూ ఉండవు. ప్రజలకు సేవలందించడంలోనే మాకు సంతోషం. బాధితులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రజలు ఇచ్చే సమాచారం మాకు ప్రతీది కీలకమే. పలు సందర్భాల్లో ఫేక్ ఫిర్యాదులు, సమాచారం వచ్చినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయం. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు అన్ని వేదికల మీదుగా పోలీసు సేవలు ప్రజలకు సులభతరంగా మారాయి. ఫిర్యాదు నుంచి పరిష్కారం వరకు ఇప్పుడు ప్రతి చర్యకు ఆధారం బహిరంగమే. డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అందిస్తున్న సహకారం మాకు బాధ్యతాయుతమైన స్ఫూర్తినిస్తోంది.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...