డిసెంబర్ నుంచి ఉస్మానియాలో ఆన్‌లైన్ సేవలు


Fri,November 16, 2018 12:33 AM

-కార్పొరేట్‌ను మించి సదుపాయాలు
-7 గంటల్లో 27 ప్లాస్టిక్ సర్జరీలు
బేగంబజార్, నవంబర్ 15 : ఉస్మానియా దవాఖానాలో రోగనిర్ధారణ పరీక్షలన్నీ ఇక మీదట ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు దవాఖాన అధికారులు శ్రీకారం చుడుతున్నారు. నేటి సమాజంలో ప్రతీది కంప్యూటరీకరణ అవుతున్న నేపథ్యంలో దవాఖాన అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకొనేందుకు కసరత్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా ఔట్ పేషెంట్(ఓపీ), ఇన్ పేషెంట్(ఐపీ), బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ తదితర విభాగాల్లో సీడాక్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటరైజేషన్ సంస్థ) ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఉస్మానియా దవాఖానలో డిసెంబర్ 8వ తేదీలోపు పూర్థి స్థాయిలో ఆన్‌లైన్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. కాగా ఇటీవల కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాణిక్‌రాజు నేతృత్వంలో సిడాక్ సంస్థ జనరల్ మేనేజర్ బాలక్రిష్ణతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతంలో ఈ విధానాన్ని సిడాక్ సంస్థ గాంధీ దవాఖానలో చేపట్టి విజయవంతం చేయడంతో ఉస్మానియా దవాఖానలో ఓపీ, ఐపీ, బ్లడ్ బ్యాంక్, ఫార్మసీలలో ఆన్‌లైన్ ప్రక్రియను చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు.

త్వరలోనే పూర్థిస్థాయిలో ఆన్‌లైన్ వ్యవస్థతో పేద రోగులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. ఇదిలా ఉండగా ప్రస్థుతం దవాఖానలో బ్లడ్ బ్యాంకు, ఫార్మసీలలో ఆన్‌లైన్ ప్రక్రియ విధానం కొనసాగుతున్నప్పటికీ పూర్థిస్థాయిలో లేకపోవడంతో ఇక మీదట ఆన్‌లైన్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గాంధీ దవాఖానలో ఈ ప్రక్రియ ప్రారంభించిన సమయంలో ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాస్‌బాబు అక్కడ విధులు నిర్వర్తించడంతో పాటు ఆన్‌లైన్ ప్రక్రియను విజయవంతం చేశారు. అయితే ఉస్మానియా దవాఖానలో కూడా ఆయా విభాగాల్లో పూర్థిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభిస్తూ ఆన్‌లైన్ ప్రక్రియను విజయవంతం చేయాలని వైద్యశాఖ అధికారులు ఇక్కడి అధికారులకు సూచించారు. గాంధీ దవాఖానలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుండటంతో ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాస్‌బాబును వైద్యశాఖ అధికారులు, సీడాక్ సంస్థ జనరల్ మేనేజర్ బాలక్రిష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆన్‌లైన్ విధానంతో పేద రోగులకు ఎంతో మేలు కలుగుతుండడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన చికిత్సలను అందించేందుకు అవకాశం మెండుగా ఉంటుందని దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్ పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌తో పేద రోగులకు ఎంతో మేలు..
సిడాక్ సంస్థ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు విధానంతో డిసెంబర్ నెలాఖరులోపు పూర్తయ్యే ఆన్‌లైన్ వ్యవస్థతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఎంతో మేలు జరుగుతుందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాస్‌బాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి చికిత్స పొందే రోగులకు సంబంధించిన రోగ నిర్ధారణ పరీక్షల నివేదికను కంప్యూటరీకరణ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతో ఆయా జిల్లాల దవాఖాన కేంద్రాలలో తెలుసుకోవడంతో పాటు రోగి స్వయంగా తెలుసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...