ఉస్మానియా మరో రికార్డు


Fri,November 16, 2018 12:33 AM

బేగంబజార్, నవంబర్ 15 : ఉస్మానియా దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఒకే రోజు 7 గంటల్లో 27 శస్త్రచికిత్సలు నిర్వహించి మరో రికార్డు సృష్టించింది. సాధారణంగా ఒకరోజులో గరిష్టంగా 8 క్లిష్టమైన, 6 సాధారణ శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 7గంటల్లో 16 అత్యంత క్లిష్టమైన, 11సాధారణ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి డా.నాగప్రసాద్ తెలిపారు. డిపార్ట్‌మెంట్‌లోని అన్ని విభాగాల వైద్యులు, నర్సింగ్, టెక్నీషియన్స్, కిందిస్థాయి సిబ్బంది సమన్వయం, పరస్పర సహకారంతోనే సక్సెస్ సాధించగలిగినట్లు వివరించారు. వివరాల్లోకి వెళితే... గురువారం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆపరేషన్ ధియేటర్‌లో రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో నలుగురికి ఫేషియో మాక్సిల్లా బోన్ ఫ్యాక్చర్ శస్త్ర చికత్సలను, కాలిలో ఉండే ఖండతో నలుగురికి ఫ్లాప్‌కవర్ శస్త్ర చికిత్సలను, రెండు నాసల్‌బోన్, పెదవులు చిట్లిన వారికి కాస్మెటిక్, కాలిన గాయాలైన వారికి స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్ర చికిత్సలను విజయంవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డా.నాగప్రసాద్ బృందంతో పాటు శస్త్ర చికిత్సల్లో కీలక పాత్ర పోషించిన అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్ బృందాన్ని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రత్యేకంగా అభినందించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...